Asia Cup India vs Pakistan: Virat Kohli's calm after Mohammad Amir storm.

India win by 5 wickets against pakistan in asia cup

Asia Cup 2016, Cricket, Dhaka, India, Live Scores, Live Updates, MS Dhoni, Pakistan, Rohit Sharma, Shahid Afridi, Sports, Umar Akmal, Virat Kohli, ICC World Twenty20, Pakistan, India, pakistan cricket board, bcci, india vs pakistan, ind vs pak icc t20, 2016 t20 world cup, t20 world cup 2016, world t20, cricket, cricket news

MS Dhoni, who came out to bat with only four required, finished things off in style by smoking one to the ropes. Yuvraj remained unbeaten on 14 and India crossed the line with little over four overs to spare.

దాయాధి పాక్ ను చిత్తుచేసిన టీమిండియా

Posted: 02/28/2016 12:43 PM IST
India win by 5 wickets against pakistan in asia cup

దాయాది దేశాల మధ్య సుమారుగా ఏడాది తరువాత జరుగుతున్న క్రికెట్ పోరులో పాకిస్థాన్ ఆటగాళ్లను చిత్తుచేసి గెలిచింది టీమిండియా. ప్రపంచ క్రికెట్ అభిమానులు అందరినీ ఎంతో ఉత్కంఠకు గురిచేసిన ఈ మ్యాచ్ లో చివరకు ధోని సేన నిలదోక్కుకుని ఆడటంతో పాకిస్థాన్ పై ఐదు విక్కెట్ల తేడాతో గెలిచారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్..  టీమిండియా ముందు 84 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ స్కోరు ఇప్పటి వరకు నాల్గవ అత్యల్ప స్కోరుగా కూడా నమోదయ్యింది. అయితే పాకిస్థాన్ నిర్ధేశించిన టార్గెట్ ను చేధించడానికి టీమిండియా కొంత నిధానంగానే చేధించింది.

మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధం తరువాత ఆసియాకప్తో తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి బరిలో దిగిన అమిర్ బౌలింగ్ లో తన సత్తా చాటాడు. తాను విసిరిన తొలి ఓవర్ లోనే టీమిండియా రెండు విక్కెట్లను కోల్పోయింది. టీమీండియా తొలి ఓవర్ లోనే రెండు విక్కెట్లను కోల్పోవడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ తాను ఎదుర్కోన్న రెండో బంతికి ఎల్బీడబ్యూగా వెనుదిరగగా, అదే ఓవర్ లో అమిర్ బంతిని ఎదుర్కోన్న అజింక్య రహానే కూడా ఎల్బీడబ్యూగా వెనుదిరగడంతో టీమిండియాలో కలవరం మెదలైంది.

అ తరువాత రోహిత్, సురేష్ రైనా కాసింత రాణిస్తున్నారన్న తరుణంలో రైనా కూడా తన విక్కట్ ను కోల్పోయాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన యువరాజ్ కాసింత దూకుడుగా ఆడుతున్న విరాట్  కోహ్లీకి మద్దతుగా నిలవగాఇద్దరు కలసి భారత్ స్కోరుబోర్డును పరిగెత్తించారు. కోహ్లీ సరిగ్గా అర్థ సెంచరీకి ముందు విక్కెట్ కోల్పోయాడు. సరిగ్గా 49 పరుగల వద్ద మహమ్మద్ సమీ వేసిన బంతికి ఎల్బీ కాకపోయినా అంపైర్ ఔట్ గా పరిగణించడంతో ఆయన వెనుదిరిగాడు. ఇక కేవలం 8 పరుగుల కావాల్సిన సమయంలో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ దోని తనదైన స్టైల్లో మ్యాచ్ను ముగించి టీమిండియాకు విజాయాన్ని అందించాడు. యువరాజ్ సింగ్ 14 పరుగలతో అజేయంగావున్నాడు. పాకిస్థాన్ కు చెందిన అమిర్ కు మూడు విక్కెట్లు లభించగా, మహమ్మద్ సమీకి రెండు విక్కట్లు లభించాయి.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ రెండెకెల స్కోరును సాధించడానికే నానా తంటాలు పడింది. భారత్ పదునైన బౌలింగ్కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తోడవడంతో పాక్ ఇంకా 15 బంతులుండగానే మూటగట్టేసింది. టాస్ గెలిచిన భారత్ తొలుత పాకిస్తాన్ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ముందు పాకిస్తాన్ బ్యాటింగ్లో కట్టడి చేయాలని భావించిన ధోని అండ్ గ్యాంగ్ అందుకు తగ్గట్టునే రాణించింది. కేవలం 17.3 ఓవర్లలో 83 పరుగులకే పాక్ ను కూల్చేసింది.

పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10),షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. సర్ఫరాజ్ అహ్మద్(25) చేసిన పరుగులే పాక్ జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, రవీంద్ర జడేజాకు రెండు, నెహ్రా, బూమ్రా, యువరాజ్ సింగ్లకు తలో వికెట్ లభించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asia cup Twenty20  Pakistan  India  pakistan cricket board  bcci  

Other Articles