youngsters bumrah, pandya rock with good performance against pakistan

Bumrah pandya prove worth in high pressure india vs pak match

India vs Pakistan, Asia Cup T20, Jasprit Bumrah, Hardik Pandya, Ashish Nehra, Ravichandran Ashwin, all roundr hardik, MS Dhoni, shikar dhawan, ajinkya rahane, rohit sharma, ind vs pak, asia cup

indian cricket team youngsters jasprith bumrah, hardhik pandya rock with good bowling performance against pakistan

పాకిస్థాన్ ను కట్టడి చేసిన యంగస్టర్లు వీళ్లే..

Posted: 02/28/2016 12:52 PM IST
Bumrah pandya prove worth in high pressure india vs pak match

ఎంతో ఉత్కంఠ, ఒత్తిడి ఉండేదే క్రికెట్ మ్యాచ్. అందులో దాయాది పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే.. ఇక నరాలు తెగే ఉత్కంఠ. అలాంటి మ్యాచ్ అందులోనూ ఫోట్టి ఫార్మెట్ ట్వీ-20, ఉన్న నాలుగు ఓవర్లలోనే ప్రత్యర్థి వికెట్లను పడగోట్టాలి. తమ సత్తా చాటాలి అలాంటి మ్యాచులో టీమిండియా యువ ఆటగాళ్లు చెలరేగిపోయారు. తమ బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే కాకుండా తమ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ గేమ్‌ ఆడారు. ఆస్ట్రేలియాతో మూడు అంతర్జాతీయ ట్వీ-20 మ్యాచుల సందర్భంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వాళ్లు సరిగ్గా నెల తిరిగే సరికి తమ సత్తా ఏమిటో చాటారు. వాళ్లే  జస్ప్రీత్ బూమ్రా, హార్దిక్ పాండ్యా.

ఆసిస్‌ పోరులో టీమిండియాలో చోటు సంపాదించిన ఈ యంగ్‌స్టర్స్‌ బుమ్రా, పాండ్యా. జట్టులో సీనియర్ మోస్ట్‌ ఆటగాడైన ఆశిష్ నెహ్రాకు సరైన సమయంలో తగిన సహకారం అందించడం ద్వారా బూమ్రా, పాండ్యా పాక్‌ బ్యాటింగ్ లైనప్‌ను ముట్టించడంలో సఫలమయ్యారు. ఆసియా కప్‌ లో పాకిస్థాన్ తో జరిగిన టీ-20 మ్యాచులో భారత్‌ బౌలర్లు చెలరేగడంతో పాక్‌ 83 పరుగులకే చాప చుట్టేసింది. పేస్‌ బౌలర్ అయిన బూమ్రా పాక్‌ మ్యాచులో తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లలో అతను ఎనిమిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బూమ్రా విసిరిన 18 బంతుల్లో 16 బంతులు డాట్‌ బాల్స్ కావడం గమనార్హం. ఇక పాండ్యా మూడు వికెట్లతో ఈ మ్యాచులో మోస్ట్‌  సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచాడు. మూడు ఓవర్లలో అతను 8 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు తీశాడు.

అటు అల్ రౌండర్ పాండ్యా తనలో బౌలింగ్ స్కిల్స్‌ కూడా ఉన్నాయని ఈ మ్యాచ్‌ ద్వారా చాటాడు. మొత్తంగా టీమిండియాకు తానొక ఆల్‌రౌండర్‌ కానున్నాడన్న సంకేతాలు ఇచ్చాడు. పిచ్‌ పేస్‌కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్‌ ఆశ్విన్‌ను పక్కనబెట్టి నెహ్రా, బూమ్రా, పాండ్యాతో బరిలోకి దిగడం ధోనీ టీమ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు అనుభవం లేకపోయినా దాయాది పోరులో రాణించిన తీరును బట్టి.. భవిష్యత్తు మరింత మంచి క్రికెట్ వీరి నుంచి ఆశించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Pakistan  Asia Cup T20  Jasprit Bumrah  Hardik Pandya  

Other Articles