West Indies Can Regain World Twenty20 Title, Says Curtly Ambrose

Ambrose backs wi to regain t20 title

West Indies,Curtly Elconn Lynwall Ambrose, world twenty 20, icc t20 world cup, ambrose west indies, World T20, 2016,Cricket latest World T20, 2016 news

West Indies bowling coach Curtly Ambrose believes they have the best bunch of Twenty20 players in the world, who can help them regain the World Twenty20 after 2012

ఈ సారి టీ20 వరల్డ్ కప్ మాదే : అంబ్రోస్

Posted: 03/02/2016 06:50 PM IST
Ambrose backs wi to regain t20 title

అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆధ్వర్యంలో భారత్ వేదికగా త్వరలో జరుగనున్న ట్వంటీ 20 వరల్డ్కప్ను ఈ సారి తమ దేశానికి చెందిన క్రికెట్ జట్టు సొంత చేసుకుంటుందని వెస్టిండీస్ దేశ బౌలింగ్ కోచ్ కర్ట్లీ ఆంబ్రోస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ సాధించడానికి వెస్టిండీస్కు అన్ని అర్హతలున్నాయని ఆ దేశ బౌలింగ్ కోచ్ కర్ట్లీ ఆంబ్రోస్ ధీమా వ్యక్తం చేశాడు. అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్లు తమ జట్టు సొంతమని ఈ సందర్భంగా ఆంబ్రోస్ గుర్తు చేశాడు. ఇప్పటికే దేశవాళీ ట్వంటీ 20 లీగ్ల్లో తమ ఆటగాళ్లు అంచనాలు మించి రాణిస్తున్నారని, అదే ఫామ్ను వరల్డ్ ట్వంటీ 20 వేదికపై కూడా కనబరస్తారనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

'మా జట్టును చూడండి.  దాదాపు సగం మంది  విండీస్  ఆటగాళ్లకు విదేశాల్లో జరిగే ట్వంటీ 20 లీగ్ల్లో మంచి డిమాండ్ ఉంది. కొంతమంది ఒకే లీగ్ లో వేర్వేరు జట్లుకు ఆడుతుండగా,  మరికొంతమంది మరో లీగ్లో కలిసి ఆడుతున్నారు. ఇది వెస్టిండీస్కు అడ్వాంటేజ్ అవుతుంది' అని ఆంబ్రోస్ తెలిపాడు. వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్, మార్లోన్ శామ్యూల్స్, ఆండ్రూ రస్సెల్, డారెన్ సమీలతో కూడిన  సీనియర్ ఆటగాళ్లుండటం  తమకు అదనపు బలమని ఆంబ్రోస్ పేర్కొన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : west indies  world twenty 20  icc t20 world cup  ambrose  

Other Articles