Former NZ cricket captain Martin Crowe succumbs to cancer

Former nz cricket captain passes away

martin crowe, new zealand, martin crowe dead, martin crowe cancer, martin crowe cricket, martin crowe passes away, martin crowe funeral, martin crowe pics

Former New Zealand cricket captain Martin Crowe has died of lymphoma aged 53, his family said on Thursday.

న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో కన్నుమూత

Posted: 03/03/2016 10:51 AM IST
Former nz cricket captain passes away

న్యూజిలాండ్ బ్యాటింగ్ లెజెండ్, స్టైలిష్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో (53) క్యాన్సర్తో కన్నుమూశారు. న్యూజీలాండ్ దిగ్గజ బ్యాట్స్ మెన్ గా ఎన్నో రికార్డులు తిరగరాసి, తన పేరున ఎన్నో రికార్డును లిఖించుకున్న మార్టిన్ క్రో.. తనను పట్టి వేధించిన క్యాన్సర్ వ్యాధి ముందు తలవంచక తప్పలేదు. క్రికెట్ రంగానికి ఆయన ఎన్నో సేవలు చేయాల్సి వుండగా.. విధి మాత్రం ఆయనను 53 ఏళ్లకే తీసుకునిపోయింది. గత కొన్నేళ్లుగా ఆయన ఫాలిక్యులర్ లింఫోమా క్యాన్సర్తో బాధపడుతున్నారు. 2012లో క్యాన్సర్ నుంచి క్రోవ్ విముక్తి అయినట్లు డాక్టర్లు వెల్లడించినప్పటికీ ... 2014లో మళ్లీ లింఫోమా ఛాయలు కనిపించాయి.

దీంతో అప్పటి నుంచి కీమోథెరపీ చేయించుకున్నప్పటికీ  మార్టిన్ క్రో వ్యాధి ముదరడంతో గురువారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. క్రో కు భార్య లోరైన్ డౌన్స్, కుమార్తె ఎమ్మా, స్టెప్ చిల్డన్స్ హిల్టన్, జాస్మిన్ ఉన్నారు. కివీస్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కిన మార్టిన్ క్రో హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రోకు వరుసకు సోదరుడు. టెస్టు కెరీర్‌లో మార్టిన్ 77 మ్యాచ్‌లాడి 45.36 పరుగుల సగటుతో 17 సెంచరీలు సాధించారు. శ్రీలంకతో 1991లో జరిగిన మ్యాచ్ లో 299 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు 143 వన్డే మ్యాచ్ లు ఆడిన క్రో 38.55 పరుగలు సగుటున 4 వేల 704 పరుగులు సాధించాడు. ఈ ప్రయాణంలో ఆయన మూడు పర్యాయాలు ప్రపంచ క్రికెట్ కప్ లో భాగం పంచుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Martin Crowe  new zealand  former captain  cricket  passes away  

Other Articles