Asia Cup 2016: Mashrafe Mortaza urges teammates to stay focused for the final

Mashrafe mortaza urges teammates to stay focused for the final

India, Bangladesh, Asia Cup 2016,Indian Cricket,Bangladesh Cricket,Mashrafe Mortaza,Cricket

Bangladesh Captain Mashrafe Mortaza is delighted at reaching the Asia Cup final but wants his teammates to stay focused.

టీమిండియాతో మ్యాచ్పై దృష్టి పెట్టండి మోర్తజా

Posted: 03/04/2016 04:58 PM IST
Mashrafe mortaza urges teammates to stay focused for the final

ఆసియా కప్లో తొలిసారిగా నిర్వహించిన టీ20 ఫార్మెట్ టోర్నీ ఫైనల్ కు చేరుకుంది. మే 6న ఆదివారం టీమిండియాతో జరిగే తుది పోరుకు తమ జట్టు పూర్తి పోకస్ తో వుండాలని టీమ్ మేట్లకు బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్  మష్రాఫ్ మోర్తజా సూచించారు. ఈ మ్యాచ్ లో తమ జట్టు సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. తాము వరుస మూడు మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్ చేరడం జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నాడు. ఇదే ఊపును ఫైనల్లో కూడా కొనసాగిస్తామని మోర్తజా పేర్కొన్నాడు.
 
ఫైనల్ పోరులో ఆత్మవిశ్వాసమే తమ ఆయుధంగా పోరాడుతామని మోర్తజా పేర్కొన్నాడు. తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వడానికి  ప్రయత్నిస్తామన్నాడు. ఒకవేళ అదే జరిగితే ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్నాడు. గత నాలుగు సంవత్సరాల్లో బంగ్లాదేశ్ రెండుసార్లు ఫైనల్ కు చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియాను గతంలో ఓటించిన తాము మళ్లీ అదే విధమైన ప్రణాళికతో ధోని సేన కట్టిడి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

ఈ సందర్భంగా ఆటగాళ్లకు కొన్ని సూచనలు చేశాడు. 'టీమిండియాతో మ్యాచ్పై దృష్టి పెట్టండి. ఏ ఒక్క ఆటగాడు రిలాక్స్ కావొద్దు. ఇంకా ఫైనల్ అడ్డంకిని అధిగమించాల్సి ఉంది. ఎటువంటి ఒత్తిడికి లోను కావొద్దు. మనం సహజసిద్ధంగా ఆడటానికి ప్రయత్నిద్దాం. టీమిండియాతో అమీతుమీ పోరులో సర్వశక్తులు పెట్టి పోరాడుదాం' అని మోర్తజా తెలిపాడు.లీగ్ మ్యాచ్ లో భారత్ పై బంగ్లాదేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asia Cup 2016  India  Bangladesh  Mashrafe Mortaza  Cricket  

Other Articles