Asia Cup final: India are favourites but Bangladesh will take their chances in unpredictable T20 format

India looks stay on asia cup final

India vs Bangladesh, asia cup final 2016, Ind vs Ban, Asia Cup, Cricket Score, cricket, Mahendra Singh Dhoni, asia cupn 2016, india, uae,Dhoni, india, bangladesh, twenty 20, rohit sharma, shikhar dhawan, virat kohli, Yuvraj Singh, cricket news

India will square off against a passionate and sprightly Bangladesh in their quest for continental supremacy in the final of the Asia Cup Twenty20 cricket tournament in Mirpur on Sunday.

ఆసియా కప్: తుది సమరానికి ‘సై’ అంటున్న టీమిండియా

Posted: 03/05/2016 05:38 PM IST
India looks stay on asia cup final

ఆసియా కప్ టోర్నమెంటులో ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్తున్న టీమిండియా అదివారం జరుగనున్న తుది సమరంలో నువ్వా నేనా అని తేల్చుకునేందుకు బంగ్లాదేశ్ తో పోటీపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. అతిధ్య జట్టుతో తుది సమరానికి సై అంటోంది. ఆదివారం షేరే బంగ్లా స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టును మరోమారు మట్టికరిపించి విజయంతో ప్రపంచ కప్ టోర్నీలోకి అడుగుపెట్టాలని ధోని సేన ఉవ్విళ్లూరుతుందిజ భారత కాలమాన ప్రకారం రేపు రాత్రి గం.700.లకు ఇరు జట్లు మధ్య జరిగే అమీతుమీ పోరులో ధోని సేనే ఫేవరెట్.

తొలిసారి ట్వంటీ 20 ఫార్మెట్లో జరుగుతున్న ఆసియాకప్లో ధోని సేన అంచనాలను అందుకుంటూ రాణిస్తోంది.  అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యంగా కనబడుతున్న టీమిండియా మరో విజయాన్ని సాధించి టోర్నీని ఘనంగా ముగించాలని భావిస్తోంది.  టీమిండియా జట్టులో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ లు బ్యాటింగ్లో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, బౌలింగ్ లో ఆశిష్ నెహ్రా, బూమ్రా, హార్దిక్ పాండ్యా, అశ్విన్లు ప్రత్యర్థి బ్యాట్సమెన్ను కట్టడి చేయడంలో ముఖ్య భూమిక నిర్వహిస్తున్నారు. మరోసారి టీమిండియా సమష్టిగా రాణిస్తే ఆసియాకప్ను సగర్వంగా అందుకునే అవకాశం ఉంది.

అయితే ఈ టోర్నీ స్వదేశంలో జరుగుతుండటంతో బంగ్లాదేశ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అక్కడి పరిస్థితులు కూడా బంగ్లాదేశ్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్ వరుస మూడు విజయాలు సాధించి ఫైనల్ కు చేరిన విషయం ధోని సేన పరిగణలోకి తీసుకునే సిద్దమవుతుంది. భారత్పై జరిగిన లీగ్ మ్యాచ్లో మాత్రమే ఓటమి పాలైన బంగ్లాదేశ్ అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.  బంగ్లా బ్యాటింగ్ లో షబ్బీర్ రెహ్మాన్,  మొహ్మద్ మిథున్, సౌమ్య సర్కార్ బ్యాటింగ్లో కీలకం కాగా, బౌలింగ్లో మోర్తజా, అమిన్ హాసన్,  తస్కీన్ అహ్మద్, షకిబుల్ హసన్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asia cupn 2016  india  bangladesh  Mahendra Singh Dhoni  twenty 20  

Other Articles