Malinga steps down as captain, Mathews to lead in World T20

Lasith malinga steps down as sri lanka t20i skipper

world t20, world t20 updates, world t20 news, world t20 scores, asia cup, asia cup t20, lasith malinga, malinga wickets, angelo mathews, mathews captain, sri lanka cricket, sports news, sports, cricket news, cricket

Angelo Mathews will take over as captain of Sri Lankan team and will lead the side in all three formats.

టీ-20 కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్న మలింగా

Posted: 03/08/2016 01:56 PM IST
Lasith malinga steps down as sri lanka t20i skipper

ఆసియాకప్ టోర్నీలో ఘోరంగా విఫలమైన శ్రీలంక క్రికెట్ జట్టు దిద్దుబాటు చర్యలకు దిగింది. గత కొంతకాలంగా గాయాలతో సతమవుతున్న లషిత్ మలింగాను వరల్డ్ టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే  ప్రయత్నంలో ఉంది. ఆ స్థానంలో ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ను కెప్టెన్గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు  తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న మాథ్యూస్ను టీ 20ల్లో కూడా సారథిగా కొనసాగించేందుకు శ్రీలంక క్రికెట్ యాజమాన్యం మొగ్గుచూపుతోంది.
 
గత రాత్రి తనను కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తప్పించాలని కోరుతూ మలింగా లేఖ రాసిన నేపథ్యంలోనే  ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఎస్ఎస్సీ వైస్ ప్రెసిడెంట్ మోహన్ డిసిల్వా పేర్కొన్నారు.  ఒకవేళ మలింగాను కేవలం కెప్టెన్సీ నుంచి తొలగించినా, జట్టు స్క్వాడ్లో అతను యథావిధిగా కొనసాగుతాడని డిసిల్వా స్పష్టం చేశారు. ఈ వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న శ్రీలంక జట్టును మలింగా గాయం తీవ్రంగా బాధిస్తోంది. 2014లో బంగ్లాదేశ్లో జరిగిన వరల్డ్ టీ 20లో మలింగా నేతృత్వంలోని శ్రీలంక చాంపియన్గా అవతరించిన సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latish malinga  srilanka  Angelo Mathews  world twenty 20  

Other Articles