World T20: ICC announces Eden Gardens as new venue for Indo-Pak match

Indo pak world t20 clash shifted to kolkata

Eden Gardens, ICC World Twenty20, India vs Pakistan, PCB, Shahryar Khan, twenty 20 world cup 2016, India, Pakistan, Dharmashala, cricket news

ICC announced Eden Gardens as the new venue for the much-awaited India-Pakistan match which was previously scheduled to be held at Dharamsala.

దాయాధుల పోరుకు మారిన వేదిక.. పాక్ వినతిని మన్నించిన ఐసీసీ

Posted: 03/09/2016 08:30 PM IST
Indo pak world t20 clash shifted to kolkata

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ లో భారత్, పాక్ జట్ల మధ్య ఈ నెల హైటెన్షన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు వేదికగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియాన్ని ఐసీసీ ఖరారు చేసింది. అయితే ధర్మశాలలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో వేదికను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీని కోరింది. అయితే తొలుత వేదికను మార్చే సమస్యే లేదని తేల్చిచెప్పిన ఐసీసీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాసిన లేఖను పరిగణలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా భారత్-పాక్ మ్యాచ్ వేదికను మార్చింది.

దయాదుల పోరుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా వుండే వేదికను సిద్దం చేసింది, భారత్ లోనే ఈ వేదికకు ఓ ప్రత్యేక స్థానం వుంది, అదే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్  స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగనుంది. ఈ మేరకు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వేదిక మార్పుపై ఐసీసీ పరిశీలన నేపథ్యంలోనే నిన్న రాత్రి పాక్ నుంచి బయలుదేరాల్సిన ఆ దేశ జట్టు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఇవాళ కోల్ కతాకు చేరుకోనున్నారని సమాచారం. అంతేకాక భారత్, పాక్ తో మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉంది. గతంలోనే దాయాదుల మధ్య జరిగిన పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలిచింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC World twenty 20  twenty 20 world cup 2016  India  Pakistan  Eden Gardens  

Other Articles