Shami in focus in India's warm-up match against West Indies

India west indies ready to run check list in world t20 warm up

world t20, world t20 updates, India, west indies, practice match, world t20 news, world t20 scores, ms dhoni, ms dhoni captain, ms dhoni india, jasprit bumrah, mohammed shami, hardik pandya, yuvvraj, kohli, rohit sharma, shami bowling, sports news, sports, cricket news, cricket

Their combination more or less settled, India will look to get some much-needed practice and attain perfection in all departments when they take on an under-prepared West Indies in the ICC World Twenty20 warm-up fixture in Kolkata.

వరల్డ్ టీ20 ప్రాక్టీసు మ్యాచ్: విండీస్ తో తలపడనున్న టీమిండియా

Posted: 03/10/2016 06:26 PM IST
India west indies ready to run check list in world t20 warm up

ఆసియా కప్ లో ఓటమి ఎరుగని జట్టుగా వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న టీమిండియా ఇవాళ ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ లో వెస్టీండీస్ తో తలపడనుంది. అసియాకప్ కు ముందు జరిగిన రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయాలతో వేదిక ఎలాంటిదైనా... ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని అలవోకగా చిత్తు చేసిన వైనం... ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఇప్పట్నించి భారత్ ఆడబోతున్న మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తు. ప్రతి ప్రత్యర్థి చివరి బంతి వరకు పోరాటం చేసే అతి పెద్ద సమరం టి20 ప్రపంచకప్. ఇప్పుడు రెండోసారి ఈ కప్‌ను గెలవాలన్న ఏకైక లక్ష్యంతో భారత్ ఈ సమరానికి సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో నేడు (గురువారం) వెస్టిండీస్‌తో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

షమీపైనే అందరి దృష్టి

టీ-20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా బెంగాల్ స్పీడ్‌స్టర్‌ మహమ్మద్ షమీకి టీమిండియా తుది జట్టులో చోటు లభించడం కష్టమేనని పేర్కోన్న టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఇవాళ వెస్టిండీస్ తో జరగనున్న ప్రాక్టీసు మ్యాచ్ లో ఆయన ఫామ్ ను అంచనా వేయనున్నారు. వాస్తవానికి ఇది వార్మప్ మ్యాచే. కానీ భారత్‌కు అతి కీలకమైన పేసర్ షమీ ఫిట్‌నెస్‌ను ఈ మ్యాచ్‌ల ద్వారా అంచనా వేయనున్నారు. మోకాలి శస్త్రచికిత్సతో ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతను ఏ మేరకు ఫిట్‌గా ఉన్నాడో చూడాలని మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తోంది. దీంతో ప్రస్తుతానికి అందరి దృష్టి షమీపైనే నెలకొంది. బుధవారం జరిగిన ప్రాక్టీస్‌లో షమీ ఫర్వాలేదనిపించాడు. కోహ్లి, రోహిత్, యువరాజ్‌లకు మంచి రిథమ్‌తో దాదాపు అరగంట పాటు బౌలింగ్ చేశాడు. అయితే పేస్, కదలికల పరంగా కాస్త ఇబ్బందిపడ్డాడు. మిగతా విభాగాల్లో టీమిండియాకు తిరుగులేదు.

బౌలింగ్‌లో బుమ్రా, నెహ్రాతో పాటు హార్దిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. డెత్ ఓవర్లలో బుమ్రా ప్రదర్శన భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రధాన స్పిన్నర్ అశ్విన్, జడేజాలు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు. ఇక తమ బ్యాటింగ్ బలమేంటో టీమిండియా ఇప్పటికే నిరూపించుకుంది. ఆసియా కప్ ఫైనల్‌తో ధావన్ కూడా గాడిలో పడ్డాడు. కోహ్లి, రోహిత్, ధోని సూపర్ ఫామ్‌లో ఉన్నారు. టి20ల్లో ఆసియా కప్ గెలవడం ద్వారా భారత్ కల సగం నెరవేరింది. ఇక ప్రపంచకప్‌ను కూడా సాధించి కలను పరిపూర్ణం చేసుకోవాలని ఆటగాళ్లు భావిస్తున్నారు.

 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup  India  west indies  practice match  mohammed shami  ms dhoni  

Other Articles