Javed Miandad: Shahid Afridi should be ashamed of himself

Shame on you javed miandad lashes out at afridi for india love

2016 T20 World Cup, cricket, cricket news,2016 T20 World Cup, cricket, cricket news, India, Javed Miandad, pakistan, Shahid Afridi, t20 world cup 2016, Pakistan cricket team, T20 world cup, India vs Pakistan India, Javed Miandad, pakistan, Shahid Afridi, t20 world cup 2016, Pakistan cricket team, T20 world cup, India vs Pakistan

Shocked and hurt by Shahid Afridi's comments that Pakistan's cricketers were loved more by Indians than the fans here, former captain Javed Miandad has said that players making such statements should be "ashamed" of themselves.

అఫ్రీదీ ‘ప్రేమ’ వ్యాఖ్యలపై మండిపడ్డ మియాందాద్..

Posted: 03/15/2016 02:38 PM IST
Shame on you javed miandad lashes out at afridi for india love

పాకిస్థాన్ టీ20 జట్టు సారథి షాహిద్ అఫ్రిది.. భారతీయుల నుంచి తమకు తమ దేశంలో కన్నా అధికమైన ఆధారాభిమానాలు లభిస్తాయని చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ జావేద్ మియందాద్ తీవ్రంగా మండిపడ్డాడు. బహుశా భారత్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం వియ్యంకుడైన కారణంగానె అఫ్రీదీ చేసిన వ్యాఖ్యలను అయనకు మింగుడు పడలేదు. అఫ్రిది వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయాడు. 'మన క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా' అంటూ ఆగ్రహంగా పేర్కొన్నాడు.

పాకిస్థాన్ జట్టు భారత్‌కు వెళ్లింది టీ20 వరల్డ్ కప్ ఆడటానికే కానీ, ఆ దేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తడానికి కాదని మియందాద్ పేర్కొన్నాడు. 'భారతీయులు మనకేం ఇచ్చారు? భారత్‌లో ఉన్నా నిజాన్నే మాట్లాడండి. గత ఐదేళ్ల కాలంలో పాకిస్థాన్ క్రికెట్‌కు వాళ్లు ఏమైనా ఇచ్చారా? పాకిస్థాన్‌ జట్టుకు ఎంతోకాలం సేవలందించిన నేను.. మన ఆటగాళ్ల నోటి నుంచి ఇలాంటి మాటలు వినడం బాధించింది. షాక్‌కు గురిచేసింది' అని ఆజ్‌ చానెల్‌తో ఆయన చెప్పాడు. భారత్‌లో అడుగుపెట్టిన సందర్భంగా అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌ భారత్‌ క్రికెట్‌ ప్రేమికులను ప్రశంసల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే.

టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు కోల్‌కతాలో అగుడుపెట్టిన సందర్భంగా అఫ్రిదీ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్‌ చేశాను. అందులో భారత్ ఒకటి.  ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమకు మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afridi  Javed Miandad  Pakistan cricket team  T20 world cup  India vs Pakistan  

Other Articles