Sri Lanka's Malinga ruled out of World T20 due to knee injury

Knee injury forces lasith malinga to return home

icc world t20, wt20, wt20 india, wt20 srilanka, srilanka, srilanka cricket, sl, lanka, sl cricket, lasith malinga, lasith malinga srilanka, srilanka lasith malinga, lasith malinga injury, malinga, T20 World cup, cricket

Lasith Malinga has been ruled out of the World Twenty20 with injury, dealing a substantial blow to Sri Lanka's campaign.

టీ20 వరల్డ్ కప్ నుంచి మలింగ ఔట్..!

Posted: 03/19/2016 10:17 AM IST
Knee injury forces lasith malinga to return home

టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటులో శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ భాగస్వామ్యాలను చిత్తు చేసి తొలి ఓవర్లలోనే జట్టు తరుపున వికెట్లను తీసుకునే ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఈ టోర్నమెంటు నుంచి వెనక్కు వెళ్లారు. మోకాలి గాయంతో భాదపడుతున్న ఆయన జట్టకు దూరమయ్యాడు. గురువారం అప్ఘనిస్తాన్తో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్లో మలింగ గాయపడ్డాడని జట్టు మేనేజర్ వెల్లడించారు. దీంతో ఆప్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మలింగ లేకుండానే శ్రీలంక బరిలోకి దిగింది.

అయితే ఇప్పుడు టోర్నీ మొత్తానికి మలింగ అందుబాటులో ఉండటం లేదని శ్రీలంక జట్టు స్పోక్స్ పర్సన్ శుక్రవారం వెల్లడించారు. మలింగ లేకపోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ దిల్షాన్ (56 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మునుపటి ఫామ్‌ను అందుకుడంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 155 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lasith Malinga  world cup  injury  T20 World cup-2016  

Other Articles