వరల్డ్ టీ 20లో భాగంగా ఈడన్ గార్డన్ స్టేడియంలో మెగా ఈవెంట్ గా అభివర్ణించబడిన దాయాధులు భారత్, పాక్ పోరులో గతం నుంచి కొనసాగుతున్న చరత్రనే మరోమారు భారత్ సువర్ణాక్షారాలతో లిఖించింది. మేము బంగ్లాదేశ్ పై గెలిచి విజయదరహాసంతో బరిలోకి దిగుతున్నాం.. మీరు ఓటమిని చవిచూసి ఒత్తిడిలో వున్నారని భారత్ బలంపై దెబ్బతీసే ప్రయత్నాలకు ధోని సేన ధీటుగా బదులిచ్చింది. దీనికి తోడు ఈడెన్ గార్డెన్ తమకు అచ్చి వచ్చిన మైదానమని.. భారత్ సెంటిమెంటును కూడా విచ్చిన్నం చేసే యత్నాలకు కూడా టీమిండియా తన విజయంతోనే సమాధానం చెప్పింది.
టి20 ప్రపంచకప్‌లో భారత్ బరిలో నిలవడానికి కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో దాయాదిపై విజయంతో మళ్లీ రేస్‌లోకి వచ్చేసింది. గత మ్యాచ్ ఓటమి నుంచి తొందరగానే కోలుకున్న ధోనిసేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని చిత్తు చేసి వరల్డ్‌కప్‌లలో తమ రికార్డును నిలబెట్టుకుంది. శనివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. మూడు విక్కెట్లను త్వరుగానే చేజార్చుకున్న టీమిండియాకు రోహిత్, యువరాజ్ సింగ్ చక్కని భాగస్వామ్యం విజయతీరాలకు చేర్చింది.
మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఎదుట పాకిస్తాన్ 119 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(17), అహ్మద్ షెహజాద్(25) మోస్తరుగా రాణించినా, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (8) నిరాశపరిచాడు. ఒకానొక దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22)ల చలవతో తేరుకుంది. ఈ జోడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం ఉమర్ అక్మల్ నాల్గో వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికే మాలిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ పరుగుల వేగం మందగించింది. ఇక చివర్లో సర్ఫరాజ్ అహ్మద్(8 నాటౌట్), మొహ్మద్ హఫీజ్ (5 నాటౌట్) లు పరుగులు చేయకుండా నియంత్రించడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ 18.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నెహ్రా, బూమ్రా, రైనా, జడేజా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.
లక్ష్యచేధనకు దిగని టీమిండియా రోహిత్ (10) వికెట్ ను కల్పోయింది. ఆ వెంటనే సమీ వరుస బంతుల్లో ధావన్ (6), రైనా (0)లను క్లీన్‌బౌల్డ్ చేసి హాట్రిక్ కు బరిలో నిలువగా, ఆ వెంటనే వచ్చిన యువరాజ్ మొదట్లో కాస్త కంగారుపడినా.. ఆ తరువాత విరాట్ కోహ్లీ తో కలసి చక్కని భాగస్వామ్యంతో ఆకట్టకున్నాడు. ఇక ఎప్పటిలాగే కోహ్లి ముందుండి నడిపించాడు. తనదైన శైలిలో జాగ్రత్తగా ఆరంభం చేసి నిలదొక్కుకున్న తర్వాత దూకుడు కనబర్చాడు. చాలా కాలం తర్వాత యువరాజ్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పరుగులు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. చివర్లో అనవసర షాట్‌తో యువీ వెనుదిరిగినా... కోహ్లి, ధోని (13 నాటౌట్) మరో 13 బంతులు మిగిలి ఉండగానే ముగించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more