Big B and MS Dhoni both went 'angry young man' on Indian commentators

Dhoni gets anger during press meet big b slams commentators

icc world t20, icc world t20 scores, world t20 news, world t20 scores, india thrilling win, Harsha Bhogle, Amitabh Bachchan, MS Dhoni, Cricket, India v/s Bangladesh, India vs Bangladesh Scorecard, Zaheer Khan, VVS Laxman, Sunil Gavaskar, Virender Sehwag, Sanjay Manjrekar

India won a thrilling one-run victory over Bangladesh at the M Chinnaswamy stadium in Bengaluru in a World Twenty20 Group 2 game

మిస్టర్ కూల్, బిగ్ బిలకు కోసం వచ్చింది..!

Posted: 03/24/2016 01:35 PM IST
Dhoni gets anger during press meet big b slams commentators

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన కూల్ నెస్ ను కోల్పాయారు. ఆయనే కాదు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కూడా పీకల్లోతు కోపం వచ్చేసింది. అది కూడా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో అఖరి క్షణం వరకు విజయం దోబుచులాడిన తరువాత ఎట్టకేలకు తన అనుభవాన్ని, చుతరతను రంగరించి చివరి బంతిలో అవుట్  చేయడం ద్వారా టీమిండియాను విజయం వరించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రేస్ మీట్ లో ధోనికి కోపం వచ్చింది.  

కెప్టెన్ ధోనీ ఒక్కడే పాల్గొన్న.. మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు అడుగుతన్న ప్రశ్నలకు ధోని కూల్ గా సమాధానమిస్తున్నాడు. అంతలో అవతలి నుంచి ఏ ప్రశ్న వచ్చిందో గానీ, ఒక్కసారిగా ధోనీకి కోపం వచ్చింది. ''నాకు అర్థమైంది.. భారత్ గెలిచినందుకు మీరు సంతోషంగా లేరు. నేను చెప్పేది వినండి. మీ గొంతును, మీ ప్రశ్నను బట్టి చూస్తుంటే టీమిండియా గెలిచినందుకు మీకు ఏమాత్రం ఆనందంగా ఉన్నట్లు నాకు స్పష్టంగా తెలుస్తోంది. క్రికెట్ విషయానికి వస్తే ఇందులో స్క్రిప్టు అంటూ ఏమీ ఉండదు. మేం టాస్ ఓడిపోయిన తర్వాత వికెట్ ఎలా ఉంది, బ్యాటింగ్‌ అలా ఉండటానికి కారణాలేంటన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ప్రశ్నించడం సరికాదు' అని స్పందించాడు.

ఇక బాలీవుడ్ పెద్దాయన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు కూడా ఎక్కడలేని కోపం వచ్చింది. భారత కామెంటేటర్లు ఎప్పుడైనా కూడా అవతలి వాళ్ల కంటే మన వాళ్ల గురించి మాట్లాడాలని అమితాబ్ ట్వీట్ చేశారు. మ్యాచ్‌లో కామెంటేటర్లు బంగ్లా బ్యాట్స్‌మెన్ గురించి ఎక్కువగా ప్రస్తావించడం, చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా రెండు వికెట్లు తీసినా కూడా దాని గురించి పెద్దగా ప్రస్తావించకపోవడంతో అమితాబ్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎప్పుడు చూసినా వాళ్లనే పొగుడుతూ ఉంటారని, అవతలి జట్టులో బ్యాట్స్‌మన్ ఔట్ అయినప్పుడు దానికి దుఃఖం వ్యక్తం చేస్తున్నారని, మన బౌలింగ్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరేంటని మండిపడ్డారు.

కాగా అమితాబ్ బచ్చన్ కు జతకలసిన మిస్టర్ కూల్ తాను చెప్పడానికి ఏమీ లేదని ట్విట్ చేశాడు. అయితే అమితాబ్ ట్విట్ లపై కామెంటేటర్ హర్షా బోగ్లే సమాధానమిచ్చాడు. తాను ఇప్పటి వరకు టీవీలో కామెంటేటర్ గానే కాకుండా, బయట కూడా అదే విషయాన్ని చెబుతున్నానని, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో తాను చూసిన బెస్ట్ గ్రూప్ అఫ్ ప్లేయర్స్ వాళ్లేనని అన్నాడు. ఈ విషయంలో భారత్ వాసుల్లో కూడా చాలమంది బంగ్లాదేశ్ ను పోడుగుతూ నర్మగర్భవ్యాఖ్యలు చేసినా.. టీమిండియాను కూడా ప్రశంసిస్తున్నారు. అయితే హర్షా కాకుండా మరెవరైనా ఇతర కామెంటేటర్లు ఈ విషయమై స్పందిస్తారేమో వేచి చూడాలి మరి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  amitabh bachchan  bangladesh  team india  T20 world cup  India vs bangladesh  

Other Articles