Shahid Afridi was non-serious during World T20, alleges Waqar Younis report

Afridi apologises for pakistan s world t20 debacle

waqar younis, waqar younis pakistan, younis coach, waqar bowling, shahid afridi, afridi captain, pakistan cricket, cricket pakistan, pcb, sports news, sports, cricket news, cricket

The rift between the head coach and captain is not new as the two had also clashed during Waqar Younis' first tenure in 2011.

ఈ ఒక్కసారికీ మన్నించరూ ప్లీజ్.. అఫ్రిదీ వేడుకోలు

Posted: 03/30/2016 08:44 PM IST
Afridi apologises for pakistan s world t20 debacle

ఏ ఎండకాగొడుగు వాడుతూ.. తన నైజాన్ని భారత్ లో బయటపెట్టుకున్న పాకిస్థాన్ టీ20 కెప్టెన్ షాహిద్ అఫ్రీది, తన జట్టు కోచ్ వకార్ యూనస్ మార్గంలో నడుస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైఫ్యలంపై కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఆఫ్రిది కూడా అదే బాటలో నడిచాడు. తనను మన్నించాలని పాకిస్థాన్ ప్రజలను వేడుకున్నాడు. అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయామని వాపోయామంటూ తన ట్విటర్ పేజీలో వీడియో సందేశం పోస్టు చేశాడు.

తన గురించి ఇతరులు ఏమనుకున్నా తాను లెక్క చేయనని.. కానీ తన దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకుంటున్నా తరుణంలో తాను మన్నింపులు కోరుతున్నానని, వరల్డ్ కప్ లో ఓటమిపై  ప్రస్తుతం తనను క్షమించమని కోరుతున్నానని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ టీమ్, తాను అంచనాలకు తగినట్టు ఆడలేకపోయాం' అంటూ బ్రీఫ్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి దాని ద్వారా పాక్ ప్రజలను వేడుకున్నాడు.

తానెప్పుడూ దేశం కోసమే ఆడానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడలేదని అన్నాడు. 20 ఏళ్ల నుంచి స్టార్ హోదా మోస్తున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న అతడు స్వదేశానికి రాగానే కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భావిస్తోంది. 36 ఏళ్ల ఆఫ్రిది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత్ లో పలు వివాదాలు ఎదుర్కొన్నాడు. అయితే అప్రీది ఏరు దాటగానే తెప్ప తగలేసే తత్వం వున్న వ్యక్తిగా భారతీయులు అభివర్ణిస్తున్నాడు. భారత్ లోకి అడుగుపెడుతున్న క్రమంలో తన స్వదేశంలో లభించని ఆదరాభిమానాలు ఇక్కడ లభిస్తున్నాయని చెప్పి.. తీరా మ్యాచ్ లో ఓటమి తరువాత తమ కోసం కాశ్మీర్ నుంచి అభిమానులు వస్తారని వ్యాఖ్యానించి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afridi  forgiveness  Pakistan cricketer  dubai  

Other Articles