Australia steps in finalsm beating england in semis by 5 runs

Australia beats england by 5 runs

australia women,australia women vs england women 2016,england women,england women vs australia women 2016,icc women world cup 2016,t20 women world cup 2016, icc world t20, cricket

Australia steps into finals of ICC Women's World T20 2016, beating England by 5 runs in the semi-finals

ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన అస్ట్రేలియా..ఇంగ్లాండ్ పై విజయం

Posted: 03/30/2016 08:47 PM IST
Australia beats england by 5 runs

టీ 20 మహిళల ప్రపంచకప్లో భాగంగా బుధవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఆసీస్ 5 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆసీస్ విసిరిన 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తడబడి ఓటమి పాలైంది. ఇంగ్లండ్ మహిళల్లో కెప్టెన్ ఎడ్వర్డ్స్(31), బీమాంట్(32), సారా టేలర్(21)లు మాత్రమే మోస్తరుగా రాణించడంతో ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది.

ఇంగ్లండ్ కు చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ కు 31 పరుగులు అవసరమైన తరుణంలో ఆసీస్ మహిళలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయం సాధించారు.  ఆసీస్ బౌలర్లలో ష్కట్ రెండు వికెట్లు సాధించగా, పెర్రీ, ఫెర్రెల్, బీమ్స్, ఆస్బార్నీలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు నమోదు చేసింది. ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్(55) రాణించగా, హీలీ(25),  విల్లానీ(19) లు ఫర్వాలేదనిపించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women t20 world cup 2016  england  australia  semi finals  cricket  

Other Articles