India got basics wrong in semi finals against west indies says shane warne

India unable to get a few basics right says shane warne

2016 T20 World Cup, 2016 World T20, Brett Lee, Cricket, ICC WT0 2016, India, Ravi Shastri, Shane Warne, Simmons, Virat Kohli, West Indies, world twenty 20, india, west indies, wankhede stadium

Shane Warne had backed India to go the distance in the Twenty20 World Cup. He attributed the team’s exit to T20’s unpredictable nature and India being unable to get a few basics right.

సెమీస్ లో ‘ఆ’ తప్పిదాలే టీమిండియాను ఓటమికి కారణాలు..

Posted: 04/02/2016 07:29 PM IST
India unable to get a few basics right says shane warne

టీ 20 ప్రపంచకప్ టోర్నమెంటుకు ముందు టైటిల్ ఫేవరేట్ గా వున్న టీమిండియా టైటిల్ ఫేవరెట్గా భావించినా ఆ జట్టు సెమీ ఫైనల్లో కొన్ని తప్పులు చేయడం వల్లే భారీ మూల్యం చెల్లించుకుందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ధోని సేన కొన్ని మౌలిక విషయాలను అమలు చేయడంలో విఫలం కావడమే ఓటమి కారణమని పేర్కోన్నాడు. విండీస్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ లో లోపాలు, నోబాల్స్ కూడా పరాజయానికి కారణమయ్యాని వార్న్ చెప్పాడు.
 
టోర్నమెంట్కు ముందు టీమిండియా కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అనుకున్నాన్నాడు, అయితే నాకౌట్ స్టేజ్లో ఆ జట్టు కొన్ని తప్పులు చేయడం కారణంగానే పరాజయం పాలైందని చెప్పారు.  ప్రత్యేకంగా నోబాల్స్ వేసి దానికి తగిన మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్లో ధోని సేన నమోదు చేసిన 193 పరుగులు స్కోరు తక్కువేమి కాదని, అయితే బ్యాటింగ్ లో సత్తా చాటిన టీమిండియా.. అదే ఊపును ఫీల్డింగ్ లో, బౌలింగ్ లో్ చూపలేకపోయిందని చెప్పాడు,

వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ను తొందరగా పెవిలియన్ కు పంపడంతో ఆ మ్యాచ్ లో టీమిండియా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావించామన్నారు. అయితే టీ 20ల్లో ఏదైనా జరగొచ్చు అనడానికి ఈ మ్యాచ్ చక్కని ఉదాహరణ అన్నాడు.  విండీస్ అద్భుతమైన విజయంతో క్రెడిట్ ను సొంతం చేసుకుందని వార్న్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడో స్థానంలో విరాటే అత్యుత్తమ ఆటగాడని వార్న్ కొనియాడాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shane warne  world twenty 20  india  west indies  wankhede stadium  

Other Articles