Everything we do is for the betterment of West Indies says Brathwaite

Want to take risk by hitting big shots under pressure says brathwaite

west indies, Brathwaite, samuels, chris gayle, West Indies, england vs west indies, eng vs wi, england west indies, england vs wi, eng vs wi 2016, england vs west indies live, ind vs wi live, india vs west indies cricket,england vs west indies final, eng vs wi final, cricket

Allrounder Carlos Brathwaite, who hit four successive sixes to snatch the World Twenty20 title from England's grasp, has said "everything we do is for the betterment of West Indies.

రిస్క్ తీసుకుని నాలుగు వరుస సిక్సర్లు..

Posted: 04/04/2016 06:20 PM IST
Want to take risk by hitting big shots under pressure says brathwaite

వెస్టిండీస్ క్రికెట్ జట్టు వరల్డ్ టీ 20 ట్రోఫీని సాధించడంలో కార్లోస్ బ్రాత్ వైట్ పాత్ర మరువలేనిది. చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు చేయాల్సిన తరుణంలో 4 వరుస సిక్సర్లు బాది ఇంకా రెండు బంతులుండగానే జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే తాను హార్డ్ హిట్టింగ్ చేయడానికి ముందుగానే సిద్దమైనట్లు బ్రాత్ వైట్ తాజాగా వెల్లడించాడు. అది ఆఖరి ఓవర్ కావడంతో ఆ సమయంలో మార్లోన్ శామ్యూల్స్ ఒత్తిడిలోకి నెట్టకుండా తానే రిస్క్ తీసుకుని హిట్టింగ్ చేసినట్లు తెలిపాడు.

20 ఓవర్కు ముందు తాను-శామ్యూల్స్ మాట్లాడుకున్నామని.. ఏది ఏమైనా బంతుల్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నామని తెలిపాడు. తొలి బంతిని కనీసం హిట్ చేస్తే పరుగు తీస్తానని శామ్యూల్స్ చెప్పాడు. అయితే ఆ క్లిష్ట సమయంలో సింగిల్స్ తీసి మార్లోన్కు స్ట్రైకింగ్ ఇవ్వదలుచుకోలేదని. శామ్యూల్స్ కు స్ట్రైకింగ్ ఇచ్చి అతన్ని తాను ఒత్తిడిలోకి నెట్టాలనుకోలేదని, తానే క్రీజ్లో ఉండి చావో రేవో తేల్చుకోవాలనుకున్నానని చెప్పాడు.

బంతిని క్షణ్ణంగా పరిశీలించి బలంగా బాదాలనుకున్నా. మొదటి మూడు సిక్సర్లు కొట్టిన సమయంలో మా విజయానికి ఒక పరుగు మాత్రమే అవసరమనే విషయం నాకు తెలుసు. అయినప్పటికీ ఆ మరుసటి బంతిని బౌండరీ దాటిస్తేనే మేలనుకున్నా. ఆ సమయంలో ఎవరైనా రనౌట్ అయితే  మ్యాచ్ చేజారిపోయి ప్రమాదం ఉందనే అలా చేశా.  అదృష్టం కొద్దీ నా వ్యూహం ఫలించింది' అని బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup  west indies  Brathwaite  samuels  chris gayle  West Indies  

Other Articles