Virat Kohli named captain of ICC World T20 XI, Ashish Nehra included

Virat kohli named captain of world t20 team of the tournament

virat kohli, kohli, icc world t20, world t20, west indies cricket, india cricket, ashish nehra, world t20 xi, world t20 team, cricket news, cricket

Virat Kohli and Ashish Nehra are the only India players in the ICC World T20 XI, a team which has four players from England.

విరాట్ కోహ్లీకి వరల్డ్ టీ20 కెప్టెన్సీ.. జట్టులో నెహ్రాకూ చోటు..

Posted: 04/04/2016 07:06 PM IST
Virat kohli named captain of world t20 team of the tournament

టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఫార్మెట్ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అదేంటి అనుకుంటున్నారా..? ఇకపై ఆయన టీ20 జట్టుకు కూడా కెప్టెన్. అదెలా మహేంద్ర సింగ్ ధోనిని బిసీసీఐ తప్పిస్తుందా..? అన్న మీ ప్రశ్నలను పక్కనబెట్టి అసలు విషయంలోకి ఎంటరైతే.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వరల్డ్ టీ 20  కెప్టెన్ గా భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. వరల్డ్ టీ 20లో ప్రతిభ ఆధారంగా మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలతో కూడిన సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లిని సారథిగా ఎంపిక చేసింది.

ఈ మేరకు 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ సోమవారం వెల్లడించింది. భారత జట్టు నుంచి విరాట్ తో పాటు, వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు కూడా చోటు దక్కింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లి మూడు హాఫ్ సెంచరీల సాయంతో 273 పరుగులు నమోదు చేశాడు. వరల్డ్ ట్వంటీ 20లో విరాట్ యావరేజ్ 136.50 ఉండగా, స్ట్రైక్ రేట్ 146. 77 గా ఉంది. విరాట్ సాధించిన పరుగుల్లో 29 బౌండరీలు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే ఈ టోర్నీలో విరాట్ రెండో అత్యుత్తమ ఆటగాడిగా నిలవగా, బంగ్లాదేశ్కు చెందిన తమీమ్ ఇక్బాల్(295) తొలిస్థానాన్ని సాధించాడు.

వరల్డ్ టీ 20 పురుషుల జట్టు ఇదే..
విరాట్ కోహ్లి(భారత్, కెప్టెన్), జాసన్ రాయ్(ఇంగ్లండ్), డీకాక్(దక్షిణాఫ్రికా), జో రూట్(ఇంగ్లండ్), బట్లర్(ఇంగ్లండ్), షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా), ఆండ్రీ రస్సెల్(వెస్టిండీస్), మిచెల్ సాంట్నార్(న్యూజిలాండ్), డేవిడ్ విల్లే(ఇంగ్లండ్), శామ్యూల్ బద్రి(వెస్టిండీస్), ఆశిష్ నెహ్రా(భారత్), ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్)

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  india  world twenty 20  captain  

Other Articles