IPL 2016: I'll miss playing under MS Dhoni, says Dwayne Bravo

Will miss ms dhoni the skipper says dwayne bravo

mahendra singh dhoni, pune, Dwayne Bravo, Indian premier league, ipl 2016, ipl, ipl schedule, ipl teams, ipl venues, gujarat lions, dwayne bravo, bravo, bravo gujarat lions, bravo csk, cricket, ipl news

Dwayne Bravo played last five seasons for Chennai Super Kings under MS Dhoni. Will now be seen playing for Gujarat Lions.

ఐపీఎల్ లో కెప్టెన్ ధోనిని మిస్సవుతున్నా..

Posted: 04/09/2016 01:29 PM IST
Will miss ms dhoni the skipper says dwayne bravo

గత ఐదేళ్లుగా  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదించనట్లు డ్వేన్ బ్రేవో తాజాగా స్పష్టం చేశాడు. అయితే ఈ సీజన్ లో తామిద్దరం ఇద్దరం వేరే జట్లుకు ఆడుతుండటంతో అతనితో కలిసి ఆడటాన్ని మిస్సవుతున్నట్టు పేర్కొన్నాడు. 'ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడు. గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడేటప్పుడు ధోనితో ఆటను చాలా ఎక్కువగా ఆస్వాదించా. గతంలో అతనితో కలిసి ఆడిన ఎవ్వరైనా ఒక గొప్ప కెప్టెన్ నుంచి దూరంగా వచ్చామని కచ్చితంగా అనుకుంటారు. ధోనిలో నాయకత్వ లక్షణాలు అమోఘం. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ధోనితో కలిసి ఆడలేకపోతున్నా.

ఇప్పడు సురేష్ రైనా కెప్టెన్సీలో గుజరాత్ లయన్స్ తరపున ఆడుతున్నా. రైనాకు వంద శాతం సహకరిస్తా. ఒక నాయకుడిగా ఎదిగేందుకు రైనాకు ఇదొక చక్కటి అవకాశం' అని బ్రేవో తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం పడటంతో వాటి స్థానంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లు పోరుకు సన్నద్ధమయ్యాయి. పుణె జెయింట్స్ కు  ధోని నాయకత్వం వహిస్తుండగా, గుజరాత్ లయన్స్ కు సురేష్ రైనా సారథిగా వ్యవహరిస్తున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  pune  Dwayne Bravo  Indian premier league  

Other Articles