IPL 2016: A look at eight captains in fresh colours

Ipl 2016 a fresh look and quirky firsts

ipl 2016, ipl 2016 schedule, ipl 2016 teams, ipl schedule 2016, ipl fixtures, indian premier league, mumbai vs pune, mumbai indians vs pune supergiants, ipl score, cricket news, cricket

A look at some of the other quirky ‘firsts’ that we are likely to witness over the next six weeks.

ఐపీఎల్ పండగ: నేటి నుంచి ప్రతి సాయంత్రం సంబరాలే..

Posted: 04/09/2016 05:46 PM IST
Ipl 2016 a fresh look and quirky firsts

ఐపీఎల్ పండగ వచ్చేసింది. దేశంతో పాటు విదేశాలలోని అనేక మంది అభిమానుల ఆదరాభిమానాలను చూరగోన్న ఇండియన్ ప్రిమియర్ లీగ్.. అభిమానులను సుమారుగా రెండు మాసాల పాటు తన సంబరాల్లో మునిగితేల్చనుంది, రాబోయే 51 రోజులు భారతదేశంలో మండిపోతున్న ఎండను మించిన వేడి. సాయంత్రం అయినా, రాత్రి 11 గంటల దాకా ఆ వేడి తగ్గదు. ఈ మధ్యలో ఇళ్లలో రిమోట్ కోసం యుద్ధాలు జరుగుతాయి. ప్రతి నిమిషం ఉత్కంఠ... ప్రతి రోజూ ఓ సరికొత్త పోరాటం... బౌండరీల మోతని... సిక్సర్ల హోరుని మోసుకుంటూ ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది.

 నేడు ముంబై, పుణేల మధ్య వాంఖడే మైదానంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌కు తెరలేస్తుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో వెస్టిండీస్ క్రికెటర్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్‌ను విశ్వవిజేతగా నిలిపిన క్షణాలు ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయి. ఆ ఉత్కంఠ క్షణాలను ఇంకా పూర్తిగా ఆస్వాదించనే లేదు. టి20 ప్రపంచకప్ ద్వారా భారతదేశం క్రికెట్ మజాను ఆస్వాదించి వారం కూడా గడవలేదు. ఈలోపే మరో సంరంభం వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులను ఆనంద డోళికల్లో ముంచెత్తేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో మరో మెగా టోర్నమెంట్ వచ్చేసింది.

గత ఎనిమిదేళ్లుగా ప్రతి ఏటా వేసవిలో అంతులేని వినోదం. అయితే ఈసారి మాత్రం టోర్నీ కొంచెం కొత్తగా కనిపించబోతోంది. తొలి సీజన్ నుంచి టోర్నీలో సూపర్ స్టార్ హోదాలో చెన్నై జట్టు కెప్టెన్‌గా కనిపించిన ధోని... ఈసారి పుణే తరఫున ఆడబోతున్నాడు. గత ఏడాది ఆడిన చెన్నై, రాజస్తాన్‌ల బదులు ఈసారి పుణే, గుజరాత్ జట్లు రంగంలోకి దిగుతున్నాయి. ఇంతకాలం రామలక్ష్మణుల్లా కలిసి ప్రత్యర్థులపై యుద్ధం చేసిన ధోని, రైనా ఈసారి ప్రత్యర్థి జట్ల సారథులుగా తలపడబోతున్నారు. ఇక అభిమానులకూ ఈ వేసవి సాయంత్రాలు సమయం తెలియకుండా ముగిసిపోతాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2016  ipl score  cricket news  bcci  

Other Articles