BCCI terminates Harsha Bhogle's IPL 9 contract without his knowledge

Bcci terminates harsha bhogle s ipl contract

cricket, ipl 2016, ipl 9, indian premier league 2016, harsha bhogle, commentating contract, BCCI, terminates, favourite tournament,

Renowned cricket commentator Harsha Bhogle will not be a part of the 2016 Indian Premier League (IPL) commentary team, after the BCCI decided to terminate his contract.

కామెంటేటర్ హర్ష బోగ్లేకు షాక్.. కాంట్రాక్టు రద్దు చేసుకున్న బిసిసిఐ

Posted: 04/10/2016 02:56 PM IST
Bcci terminates harsha bhogle s ipl contract

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు, రెండు దిగ్గజ జట్లపై వేటు, లలిత్ గేట్.. ఇలా అనేక అవరోధాలను దాటుకుంటూ ప్రారంభమైన ఐపీఎల్ 9వ సీజన్ లో మరో వివాదం చెలరేగింది. ఇప్పటికే మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించే అంశం కోర్టుదాకా వెళ్లింది. తాజాగా ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేపై బీసీసీఐ అనూహ్యరీతిలో వేటువేసింది. హర్షా భోగ్లే కామెంటేటింగ్ కాంట్రాక్టును బోర్డు ఉన్నపళంగా రద్దుచేసింది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కామెంటేటర్లపై.. ప్రధానంగా హర్షా భోగ్లేను ఉద్దేశిస్తూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కామెంట్లుకూడా వేటుకు బలమైన కారణమని తెలుస్తున్నది.

సోషల్ మీడియా ద్వారా కామెంటేటర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలను సేకరిస్తోన్న బీసీసీఐ.. అదే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కారణంగా హర్షా భోగ్లేపై వేటు వేసినట్లు ఓ అధికారి చెప్పారు. కామెంట్రీపై ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 9వ సీజన్ ప్రారంభమైన రోజే హర్షాను కామెంటేటర్ల ప్యానెల్ నుంచి తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. హర్షా కూడా తాను ఇకపై ఐపీఎల్ కు అందుబాటులో ఉండబోనంటూ ట్వీట్ చేశారు.

వరల్డ్ కప్ లో ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇండియన్ కామెంటేటర్లు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మాట్లాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లు తాను చేసినవే కావడంతో మ్యాచ్ అనంతరం హర్షా భోగ్లే తనను తాను సమర్థించుకున్నారు. ఇదేకాకుండా న్యూజిలాండ్ తో నాగపూర్ లో జరిగిన ప్రారంభమ్యాచ్ లోనూ విదర్భ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో గొడవపడ్డారట హర్షా భోగ్లే.  

ఇంగ్లీష్, హిందీల్లో రెండు భాషల్లో కామెంట్రీ చెప్పేందుకు అస్తమానం అటూఇటూ తిరుగుతోన్న హర్షాను 'ఇది వీఐపీ లాంజ్ మీరు నిమిషానికోసారి అలా తిరిగితే కుదరదు'అని చెప్పారట. దీనికి హర్షా సదరు అధికారులపై చిందులేశారట. అన్ని కారణాలను బేరిజు వేసుకున్న తర్వాత హర్షాకు షాక్ ఇవ్వాల్సిందేనని ఫిక్సైన బీసీసీఐ ఆయనపై వేటు వేసింది. ఐపీఎల్ ప్రసార హక్కులు సోని-ఈఎస్ పీఎన్ చానెల్ వి కాబట్టి వారు పట్టుబట్టి హర్షాభోగ్లేను కొనసాగిస్తారా, లేక బీసీసీఐ నిర్ణయానికి సరేనంటారా చూడాలి. శని, ఆదివారాల నాటి మ్యాచ్ లకైతే భోగ్లే అందుబాటులో ఉండరని సమాచారం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  terminates  Harsha Bhogle  commentating contract  IPL 2016  

Other Articles