MS Dhoni blames pacers for Pune's poor show against Gujarat

Ipl 2016 ms dhoni blames pacers for punes poor show against gujarat

MS Dhoni,Rising Pune Supergiants,Dhoni blames bowlers,GLvRPS,Gujarat Lions,Ishant Sharma,M Ashwin,Suresh Raina,Brendon McCullum,Aaron Finch,IPL 2016

Dhoni pointed his fingers at his pace bowlers after Rising Pune Supergiants lost their second encounter of the Indian Premier League 2016 against Gujarat Lions by seven wickets

బౌలర్ల వల్లే శిష్యుడి చేతిలో పరాజయం

Posted: 04/15/2016 06:59 PM IST
Ipl 2016 ms dhoni blames pacers for punes poor show against gujarat

ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్ పై పుణే సూపర్ జెయింట్స్ ఓటమి తర్వాత తమ జట్టు బౌలింగ్‌ విభాగం ప్రదర్శనపై కెప్టెన్ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు.  పేలవమైన బౌలింగ్  కారణంగానే మ్యాచ్‌ చేజారిపోయిందని తెలిపాడు. పవర్‌ప్లేలో బౌలర్లు  రాణించలేకపోయారన్నాడు. 'మేము మంచి లక్ష్యాన్నే గుజరాత్‌ ముందు ఉంచాం. ఫాస్ట్ బౌలర్లు సరిగా రాణించలేకపోవడంతో 6వ ఓవర్లో అశ్విన్‌తో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. ఆ ఓవర్ లో 20 పరుగులు ఇవ్వడంతో గుజరాత్ గెలుపును ఆపలేకపోయాం' అని ధోని చెప్పుకొచ్చాడు. దీంతో తదుపరి మ్యాచ్‌లలో బౌలింగ్‌ విభాగంలో మార్పులుంటాయనే విషయం ధోని వ్యాఖ్యలను బట్టి ఆర్థం అవుతోంది.

గుజరాత్‌ లయన్స్‌కు ఓపెనర్లు ఫించ్, మెకల్లమ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీపడి పరుగులు సాధించారు. ఆర్పీ సింగ్ ఓవర్లో మెకల్లమ్ రెండు సిక్సర్లు బాదగా, ఆ తర్వాత ఇషాంత్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. తన తొలి ఓవర్లో నాలుగే పరుగులు ఇచ్చి అశ్విన్ కాస్త తెరిపినిచ్చినా... తర్వాతి రెండు ఓవర్లు గుజరాత్ పంట పండించాయి. అశ్విన్ వేసిన ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన ఫించ్... భాటియా తర్వాత ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి 33 పరుగులు వచ్చాయి. ఇదే జోరులో 33 బంతుల్లోనే ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తయింది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం లయన్స్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ఆరోన్ ఫించ్ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (31 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 51 బంతుల్లోనే 85 పరుగులు జత చేసి జట్టు విజయాన్ని సులువు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Dhoni  Pune Supergiants  Gujarat  Bowlers  

Other Articles