Ashish Nehra out for a couple of games with groin injury

Nehra ruled out of sunrisers hyderabad s next two fixtures

Ashish Nehra, David Warner, ashish nehra goin injury, Indian Premier League, IPL, IPL 2016, IPL 9, Royal Challengers Bangalore, Sarfaraz Khan, Sunrisers Hyderabad

Sunrisers Hyderabad captain David Warner said his premium pacer Ashish Nehra will be out for a couple of games due to a groin injury.

సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ,. గాయంతో నెహ్రా ఔట్..

Posted: 04/13/2016 03:58 PM IST
Nehra ruled out of sunrisers hyderabad s next two fixtures

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-9లో తామ సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతూ, టీ 20 టోర్నీలో విండీస్ మాదిరిగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో తాము కూడా ఎలాంటి అంచానాలు లేకుండానే టైటిల్  నెగ్గుకురావాలని బరిలో దిగని సన్ రైజర్స్ కు అదిలోనే హంసపాద పడింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు.

ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్వయంగా వెల్లడించాడు. బెంగళూరు జట్టు యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కారణంగానే ఐపీఎల్ -9 తొలి మ్యాచ్ లో తాము ఓడిపోయామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. చివరి ఓవర్లలో విజృభించి ఆడి సర్ఫరాజ్ తమ నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడని పేర్కొన్నాడు. అతడు చేసిన పరుగులే మ్యాచ్ లో కీలకంగా మారాయని చెప్పాడు. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపం మారిపోయిందన్నాడు. విరాట్ కోహ్లి, డివిలియర్స్ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడారని మెచ్చుకున్నాడు.

అయితే గజ్జలో గాయం కావడంతో నెహ్రా కొన్ని మ్యాచ్ లు దూరమయ్యాడని తెలిపాడు. మంగళవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో నెహ్రా గాయపడ్డాడు. దీంతో తన కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. 2.1 ఓవర్లు వేసి మధ్యలో వైదొలిగాడు. మిగిలిన 5 బంతులను మరో బౌలర్ ఆశిష్‌ రెడ్డి వేశాడు. హైదరాబాద్ తరపున నెహ్రా  తొలిసారిగా ఆడుతున్నాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  ashish nehra  goin injury  david warner  sunrisers hyderabad  Sarfaraz Khan  

Other Articles