IPL 2016: Chris Gayle's form not a big concern, says Virat Kohli

Not too worried about gayles form says kohli

ipl 2016, ipl, ipl schedules, ipl standings, ipl news, rcb vs dd, delhi daredevils royal challengers bangalore, virat kohli, quinton de kock, de kock hundred, sports news, sports, cricket news, cricket

We were 50 runs short, says RCB skipper Virat Kohli. Terming Quinton De Kock as a quality player,

క్రిస్ గేల్ ఫామ్ పై ఆందోళన అవసరంలేదు

Posted: 04/18/2016 01:42 PM IST
Not too worried about gayles form says kohli

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ఫామ్పై వస్తున్న విమర్శలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తోసిపుచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున  రెండు మ్యాచ్ లు అడిన క్రిస్ గేల్ రెండింటిలోనూ రమారమి  డకౌట్ కావడంతో ఆయన ఫామ్ పై విమర్శలు వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే క్రిస్ గేల్ ఫామ్పై ఆందోళన అవసరంలేదని లేదని విరాట్ కోహ్లీ అన్నాడు.

ఐపీఎల్ లో కీలక సమయంలో గేల్ పుంజుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టుకు  అవసరమైనపుడు గేల్ సెంచరీ చేయవచ్చని అన్నాడు. ఐపీఎల్లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ తొలి రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. తొలి మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు చేయగా, రెండో మ్యాచ్లో సున్నా చుట్టేశాడు. గేల్ ఆడిన చివరి ఐదు టి-20ల్లో అతడి స్కోరు డబుల్ డిజిట్ దాటలేదు. ఢిల్లీ డేర్డెవిల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో బెంగళూరు భారీ స్కోరు చేసినా ఓటమి తప్పలేదు.

'గేల్ ఫామ్పై నాకు ఆందోళన లేదు. జట్టులో ఇతర ఆటగాళ్లు బాగానే రాణిస్తున్నారు. కొందరు విఫలమైనా మిగిలిన ఆటగాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అయితే మా జట్టులో గేల్ కీలక ఆటగాడు. తమ ప్రతీ మ్యాచ్ కు వచ్చే ఆడియన్స్ లో గేల్ అభిమానులు ప్రత్యేకంగా వుంటారు. ప్రతి టి-20 మ్యాచ్లోనూ అభిమానులు అతడిపై ఎక్కువ అంచనా వేసుకుంటారు. ఎందుకంటే గేల్ విధ్వంసకర బ్యాట్స్మన్. అభిమానుల అంచనాకు తగినట్టు రాణిస్తాడు' అని కోహ్లీ చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Royal Challengers Bangalore  Virat Kohli  Chris Gayle  delhi dare devils  

Other Articles