Pakistan Cricket Board disappointed after West Indies refuses to play in Pakistan

Windies turn down pakistan t20 tour

Windies turn down Pakistan T20 tour, Windies snubs PCB offer for Lahore T20s, West Indies refuses to tour Pakistan, PCB, Pakistan Cricket Board, West Indies, Pakistan, cricket news, Sri Lanka, Uae, Sports

Zimbabwe toured Pakistan last May to play limited over games in Lahore and the tour was a big success for the PCB.

పిసీబికి విండీస్ షాక్.. పాక్ లో అడేందుకు నిరాకరణ..

Posted: 04/19/2016 05:27 PM IST
Windies turn down pakistan t20 tour

పాకిస్థాన్ లో క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు విముఖత ప్రదర్శించడంతో పాటు సరిహద్దు చోరబాట్లను నివారించే వరకు పాకిస్తాన్ తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ వుండదంటూ భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు తేల్చిచెప్పిన సందర్భంలో బిసిసిఐపై విమర్శలను గుప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నుంచి కూడా అదే తరహా షక్ తగిలింది. పాకిస్తాన్ తో జరిగే సిరీస్ లలో టీ 20 సిరీస్ లను తమ దేశంలో అడాలని మెలిక పెట్టిన పాకిస్థాన్ కు వెస్టిండీస్ ఫాక్ ఇచ్చింది. లాహోర్ లో ఇటీవల సంభవించిన ఆత్మహుతి దాడిలో 73 మంది అసువులు బాయడం, ఈ తరహా దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ లో తాము ఎలాంటి మ్యాచ్ లను అడలేమని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

పాకిస్థాన్ లో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఆర్ధికంగా పరిపుష్టిని చేసి అంతర్జాతీయ క్రికెట్ లో సత్తాచాటాలని భావిస్తున్న పీసీబీ ఆశలు వెస్టిండీస్ బోర్డు నిర్ణయంతో మళ్లీ ఆవిరవుతున్నాయి. షార్జాలో మ్యాచ్ లు నిర్వహించడం ద్వారా లాభాల సంగతటుంచి, ఎంతో శ్రమపడాల్సి వస్తోందని పీసీబీ వాపోతోంది. 2009లో శ్రీలంక జట్టుపై లాహోర్ లో జరిగిన తీవ్రవాద దాడి తరువాత ఆ దేశంలో పర్యటించేందుకు ఏదేశమూ ముందుకు రావడం లేదు. దీంతో షార్జా వేదికతో ఎంతో క్రేజ్ తో కూడిన భారత్ తో సిరీస్ నిర్వహించేందుకు తీవ్రంగా శ్రమించింది. అయితే బీసీసీఐ అందుకు నిరాకరించడంతో పీసీబీ ఆశలు ఆవిరయ్యాయి.

అనంతరం పలు దేశాలతో ఆడేందుకు ప్రణాళికలు రచించింది. అందులో కొన్ని సత్ఫలితాలివ్వగా, తాజాగా వెస్టిండీస్ జట్టు పాక్ జట్టుతో ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కొన్ని మ్యాచ్ లు పాకిస్ధాన్ లో ఆడాలని పీసీబీ విండీస్ బోర్డుకు సూచించింది. అయితే అందుకు విండీస్ బోర్డు అంగీకరించలేదు. ఆటగాళ్ల భద్రతే తమ లక్ష్యమని, పాకిస్థాన్ లో తమ ఆటగాళ్ల భద్రతకు భరోసా లేదని స్పష్టం చేస్తూ, పాకిస్థాన్ లో ఆడలేమని స్పష్టం చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న విండీస్ బోర్డు నిర్ణయంతో పీసీబీ షాక్ కు గురైంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PCB  Pakistan Cricket Board  West Indies  Pakistan  cricket news  

Other Articles