I admire Mitchell Johnson, Wasim Akram, Brett Lee, says Jasprit Bumrah

Playing with tennis ball helped me bowl yorkers says bumrah

Australia, Brett Lee, India, Indian Premier League, Indian Premier League 2016, IPL, IPL 2016, Jasprit Bumrah, Mitchell Johnson, Mumbai Indians, Pakistan, Wasim Akram, IPL 9, Cricket latest IPL 9 news

My all-time favourite bowlers are Mitchell Johnson, Wasim Akram and even Brett Lee. I used to watch their videos and I used to bowl,” Bumrah said

నైపుణ్యం పెంచుకునేందుకు నిత్యం శ్రమిస్తా..

Posted: 04/29/2016 01:34 PM IST
Playing with tennis ball helped me bowl yorkers says bumrah

తన వైవిధ్యమైన బౌలింగ్తో భారత క్రికెట్ జట్టులో కీలకంగా మారిన జస్ప్రిత్ బూమ్రా తన బౌలింగ్ నైఫుణ్యాన్ని మరింత మెరుగుపర్చకునేందకు నిత్యం శ్రమిస్తానన్నారు. ఈ విషయంలో ఇక్కడ, అక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడైనా తాను మెలకువలను నేర్చుకునేందుకు సిద్దమన్నారు. కాగా తనకు మాజీ దిగ్గజ బౌలర్లు వసీం అక్రమ్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీల బౌలింగ్ అంటే చాలా చాలా ఇష్టమని బూమ్రా తెలిపాడు. వారి బౌలింగ్ వీడియోలను ఎక్కువగా చూడటమే కాకుండా అదే తరహాలో తన బౌలింగ్ వేయడంమంటే మరీ ఇష్టమట.
q
'నేను చాలామంది బౌలింగ్ చూస్తూ పెరిగా. అయితే అక్రం, బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్లే నా ఆల్ టైం ఫేవరెట్ బౌలర్లు. ఆ ముగ్గురు వీడియోలను ఎక్కువగా చూస్తుంటా. అయితే అంతర్జాతీయ స్థాయిలో పేస్ బౌలర్ ఎవరు కనిపించినా వారి వద్దకు వెళ్లి కొన్ని అనుమానాలను నివృతి చేసుకుంటా. అలా మిచెల్ , మలింగా, జహీర్ఖాన్ల నుంచి చాలా నేర్చుకున్నా.  నాకు రోల్ మోడల్స్ అంటూ ఎవరూ ప్రత్యేకంగా లేరు' అని బూమ్రా తెలిపాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన బూమ్రా.. ఆ సిరీస్ తనకు ఎంతో లాభించిందన్నాడు. ఆ సిరీస్ లో తన మెరుగైన ఆట ప్రతిభను కనబర్చడంతో ఆ తరువాత జరిగిన ఆసియాకప్, వరల్డ్ టీ 20లతో తనకు స్థానం లభించిందని, వాటిలో కూడా తాను తన శక్తిమెరకు మెరుగైన బంతులనే విసిరానని చెప్పాడు, మొత్తానికి తనకు కలసి వచ్చిన సిరీస్ తో పాటు రెండు టోర్నమెంటులతో తన కెరీర్ కు మరింత మేలు జరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jasprit Bumrah  IPL  teamindia  asia cup  t20 world cup  bcci  cricket  

Other Articles