Chris Morris terms IPL blitzkrieg as his 'best innings in T20 cricket'

Gujarat lions survive morris 82 in manic game

ipl 2016, ipl, ipl schedule, ipl news, ipl scores, dd vs gl, gujarat delhi, chris morris, morris daredevils, sports news, sports, cricket news, cricket

Coming out to bat at a difficult time with Delhi Daredevils tottering at 57-4 in 10.4 overs, Chris Morris blasted 82 off just 32 balls.

ఇదే నా కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్..అయినా భాధగా వుంది..

Posted: 04/29/2016 02:08 PM IST
Gujarat lions survive morris 82 in manic game

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ లయన్స్ పై 17 బంతుల్లో నమోదు చేసిన హాఫ్ సెంచరీనే తన టీ 20 కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు క్రిస్ మోరిస్ స్పష్టం చేశాడు. ఆ ఇన్నింగ్స్ తనకు సంతృప్తినిచ్చినా  చివరి వరకూ క్రీజ్లో ఉండి ఢిల్లీకి విజయాన్ని అందించలేకపోవడం నిరాశకల్గించదన్నాడు. చివరి బంతికి నాలుగు బంతులు చేయాల్సిన క్రమంలో రెండు పరుగులే సాధించి ఓటమి పాలుకావడం బాధ కల్గించిదన్నాడు.

'నా టీ 20 కెరీర్ లో ఇదే అత్యత్తమ ఇన్నింగ్స్.  నేను ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చేసరికి  మా జట్టు ఓవర్ కు సగటున 13 పరుగులు చేయాల్సి ఉంది. నా సహజసిద్ధమైన ఆట తీరునే ప్రదర్శించాలని క్రీజ్లోకి వచ్చే సమయంలోనే అనుకున్నా.  కేవలం బంతిని బౌండరీ దాటించడంపైనే దృష్టి పెట్టా. నా వ్యూహం ఫలించింది. వికెట్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. దాంతో బౌలర్ ఎవరన్నది చూడకుండా విరుచుకుపడ్డా. కానీ చివరి ఓవర్ వరకూ క్రీజ్లో ఉన్నా జట్టును గెలిపించలేకపోయా' అని మోరిస్ తెలిపాడు.

ఐపీఎల్-లో భాగంగా బుధవారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. క్రిస్ మోరిస్ 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, 8 సిక్సర్లతో పరుగుల వరద సృష్టించినా ఢిల్లీని పరాజయం నుంచి తప్పించలేకపోయాడు. గుజరాత్ విసిరిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 171 పరుగులకే పరిమితమై పాలైంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2016  cricket  gujarat lions  delhi dare devils  chris morris  

Other Articles