Lions took advantage of fresh wicket says piyush chawla

Fresh wicket gave lions the edge says piyush chawla

India, Indian Premier League, Indian Premier League 2016, IPL, IPL 2016, Cricket News, Piyush Chawla, yusuf patan, shakibul hassan, Praveen Kumar, Dinesh Karthik, Kolkata Knight Riders v Gujarat Lions at Kolkata, Gujarat Lions cricket, India cricket, Kolkata Knight Riders, cricket

Kolkata Knight Riders leg-spinner Piyush Chawla said Gujarat Lions got the advantage of bowling on a fresh wicket to secure a five-wicket win at eden.

లయన్స్ కు ఈడెన్ లో 'వికెట్' అనుకూలించింది!

Posted: 05/10/2016 04:32 PM IST
Fresh wicket gave lions the edge says piyush chawla

ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో తమ జట్టు ఓటమి పాలు కావడానికి  ఈడెన్ గార్డె న్ వికెట్ తాజాగా ఉండటమే ప్రధాన కారణమని కోల్ కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు. అంతకుముందు రాత్రి వర్షం పడటం వల్ల వికెట్ కొత్తదనాన్ని సంతరించుకుని గుజరాత్కు లాభించిందన్నాడు. ఆ వికెట్ పై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయడంతో తాము కష్టాల్లో పడినట్లు చావ్లా తెలిపాడు. తమ జట్టు 24 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరును నమోదు చేయలేకపోయామని, అది కూడా తమకు ఓటమికి కారణమయ్యిందని అన్నాడు.

'వికెట్ తాజాగా ఉంది. అందుచేత ఫస్ట్ బ్యాటింగ్ మాకు అనుకూలించలేదు. మ్యాచ్ ఆరంభంలోనే కొన్ని కీలక వికెట్లును చేజార్చుకుని ఇబ్బందుల్లో పడ్డాం. ఆపై తేరుకుని గౌరవప్రదమైన స్కోరును చేయడం నిజంగా అభినందనీయమే. మా ఓటమికి చాలా కారణాలున్నా,  కొన్ని సందర్భాల్లో చివరి ఓవర్లలో బౌలింగ్ కూడా సరిగా లేదు. గత పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మా లక్ష్యాన్ని కాపాడుకుని స్వల్ప తేడాతో గెలిచాం. అన్నిసార్లూ పరిస్థితి ఒకేలా ఉండదు. ఇది టీ 20 ఫార్మాట్ కావడంతో బంతికి ఒక పరుగు సాధించడం కష్ట సాధ్యమేమీ కాదు' అని పీయూష్ తెలిపాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolkata Knight Riders  Gujarat Lions  IPL 2016  Piyush Chawla  

Other Articles