ఫార్మట్ ఏదనేది చూడకుండా తన బ్యాట్ ఝుళిపిస్తూ పరుగుల వదర పారిస్తున్నాడు టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ సీజన్ ఐపీఎల్ లో ఈ స్టార్ బ్యాట్స్ మెన్ చేసిన స్కోర్ చూస్తే ఎవరికైనా మతిపోవటం ఖాయం. 15 మ్యాచ్ లలో 4 సెంచరీలు, 6 అర్థసెంచరీలు సాధించడమంటే మాములు విషయం కాదు. ఇలా వరుస రికార్డులతో దూసుకెళ్తున్న కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘మోస్ట్ మార్కెటబుల్ ప్లేయర్స్’ జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఉద్ధండ పిండాలను సైతం పక్కకు నెట్టేశాడు.
‘స్పోర్ట్స్ ప్రో’ వెల్లడించిన తాజా జాబితా ప్రకారం కోహ్లీ మూడో స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ లో బాస్కెట్ బాల్ క్రీడాకారుడు స్టీఫెన్ కరె తొలిస్థానంలో ఉండగా. ఫ్రెంచ్ ఫుట్ బాల్ క్రీడాకారుడు పాల్ పోగ్బా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టెన్నిస్ నంబర్ 1 జకోవిచ్ ఈ జాబితాలో 23 వ స్థానంలో, మెస్సీ 27 వ స్థానంలో నిలవగా, స్ర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ 31వ స్థానంతో సరిపెట్టుకున్నారు. టాప్ 50 జాబితాలో హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు కూడా చోటు దక్కటం విశేషం. కాగా, ఆటగాళ్ల సంపాదన, వయసు, ఆస్తుల విలువ, వాళ్లకున్న పాపులారిటీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్పోర్ట్స్ ప్రో ఏటా ఈ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more