జింబాబ్వే పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువకులతో కూడిన భారత క్రికెట్ జట్టు కొత్త సవాల్ కు సిద్ధమైంది. తన రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించుకునే క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లి న భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టూర్లో కెప్టెన్ ధోని మినహా దాదాపు అంతా కొత్త వారే కావడంతో భారత జట్టు ఎంతవరకూ రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 11 ఏళ్ల తరువాత ధోని, జింబాబ్వే పర్యటనకు రావడంతో ఆయనకు ఈ పర్యటన కోత్తగానే వుంటుందనే చెప్పాలి.
అయితే తాజా పర్యటనలో ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో భారత జట్టుకు కఠిన పరీక్ష తప్పకపోవచ్చు. అటు జింబాబ్వే పసికూనగా కనిపిస్తున్నా, సంచలన విజయాలు నమోదు చేయడంలో ఆ జట్టు ఎప్పుడూ ముందుంటుంది. దీంతో ధోని అండ్ గ్యాంగ్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఆడితేనే జింబాబ్వేపై విజయాలు సాధ్యమవుతాయి. ప్రస్తుత భారత జట్టు ఐదుగురు ఆటగాళ్లు తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేయబోతున్నారు. వీరిలో యుజ్వేంద్వ చాహల్, ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్‌లు భారత జెర్సీని మొదటిసారి ధరించనున్నారు.
అయితే మరో యువ క్రికెటర్ లోకేష్ రాహుల్‌లు కూడా అంతర్జాతీయ అనుభవం తక్కువగానే చెప్పాలి. కేవలం టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రాహుల్.. జింబాబ్వే పర్యటన ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ధోని తో పాటు, అంబటి రాయుడు, అక్షర్ పటేల్ కు మాత్రమే అంతర్జాతీయంగా ఆడిన అనుభవం ఉంది. రేపట్నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం గం.12.30 ని.లకు హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగునుంది. దీంతో సరికొత్త జట్టుకు ధోని ఏ వ్యూహ రచనతో సిద్ధం చేస్తాడో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more