మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ అతిథ్య జట్టు జరిగిన తొలి వన్డేలో భారత యువ సేన అద్బుత విజయాన్ని అందుకుంది. జింబాబ్వే నిర్ధేశించిన 169 పరుగుల విజయలక్ష్యాన్ని తొమ్మిది వికెట్ల తో విజయాన్ని అందుకుంది. జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్న ధోని అండ్ గ్యాంగ్ తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేకు భారత షాకిచ్చింది.
భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100 నాటౌట్;115 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్) శతకంతో రాణించగా, అంబటి రాయుడు(62 నాటౌట్;120 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. జింబాబ్వే విసిరిన 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలో ఓపెనర్ కరుణ్ నాయర్(7) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు జతకలిసిన అంబటి రాయుడు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఏమాత్రం ఏమరపాటుకు గురి కాకుండా సుదీర్ఘ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు.
ఈ క్రమంలోనే రాహుల్, అంబటి రాయుడు హాఫ్ సెంచరీలు సాధించారు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేయడానికి 58 బంతులను ఎదుర్కొంటే, అంబటి రాయుడు అర్థ శతకాన్ని నమోదు చేయడానికి 97 బంతులు వరకూ వేచి చూశాడు. ఈ జోడి 162 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో టీమిండియా 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా విజయానికి రెండు పరుగులు అవసరమైన తరుణంలో రాహుల్ సిక్సర్ సాధించి శతకం సాధించడం విశేషం.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టును టీమిండియా బౌటర్లు స్వల్ప స్కోరుకే నియంత్రించగలిగింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వేను భారత్ బౌలర్లు 168 పరుగులకు అలౌట్ చేశారు. దీంతో భారత్ ఎదుట 169 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. జింబాబ్వే జట్టులో చిగుంబరా(41)మినహా ఎవరూ ఆకట్టుకోలేదు టాస్ గెలిచిన ధోని తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే ఆటగాళ్లలో మూర్(3), మసకద్జా(14) , చిబాబా(13) స్వల్ప విరామాల్లో నిష్క్రమించడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. అనంతరం సిబందా(5), ఎర్విన్(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. ఆపై చిగుంబరాకు జత కలిసిన సికిందర్ రాజా(23) జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ జోడీ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జింబాబ్వే వికెట్లకు కాసేపు బ్రేక్ పడింది.
కాగా, సికిందర్ రాజా ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాక, మరోసారి జింబాబ్వే తడబడింది. అయితే చిగుంబరా తొమ్మిదో వికెట్‌గా వరకూ క్రీజ్ లో ఉండటంతో జింబాబ్వే 168 పరుగుల సాధారణ స్కోరును నమోదు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా నాలుగు వికెట్లు తీసి జింబాబ్వే నడ్డి విరిచాడు. బూమ్రా 9.5 ఓవర్లలో రెండు మేడిన్ల సాయంతో 28 పరుగులు ఇచ్చాడు. టీమిండియా మిగతా బౌలర్లలో బరిందర్ శ్రవణ్, కులకర్ణిలు తలో రెండు వికెట్లు సాధించగా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, చాహల్‌లు చెరో వికెట్ లభించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more