David Warner's century helps Australia beat Proteas in ODI

Marlon samuels guides west indies to 4 wicket win over australia

Australia vs West Indies, Marlon Samuels,west indies australia, tri-series, Marlon Samuels, david warner, marlon samuels, samuels fifty, usman khawaja, khawaja fifty, sports new,

Australia scored 265 for 7 after batting first. West Indies in reply rode on Samuels' 92 to achieve the target with 20 balls to spare.

నాలుగేళ్ల తరువాత అసీస్ పై విండీస్ విజయం..

Posted: 06/14/2016 06:12 PM IST
Marlon samuels guides west indies to 4 wicket win over australia

వన్డేల్లో నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన ఐదో వన్డేలో ఆసీస్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. 266 పరుగుల లక్ష్యాన్ని 45.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్లన్ శామ్యూల్స్(92, 87 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత పోరాటానికి తోడు చార్లెస్(48), బ్రావో(39) రాణించడంతో విండీస్ విజయాన్ని అందుకుంది. రామదిన్ 29, ఫ్లెచర్ 27 పరుగులు చేశారు.

ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నీల్, జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫాల్కనర్ ఒక వికెట్ తీశాడు.టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కంగారు టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా(98) తృటిలో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ స్మిత్(74), బెయిలీ(55) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫించ్ డకౌటయ్యాడు. విండీస్ బౌలర్లలో హొల్డర్, బ్రాత్ వైట్, పొలార్డ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. శామ్యూల్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia  west indies  tri-series  Marlon Samuels  david warner  cricket  

Other Articles