జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే గెలిచిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత యువ జట్టు మరో విజయంపై కన్నేసింది. అటు జింబాబ్వే పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగినా భారత కుర్రాళ్లకు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత జట్టులో అన్ని దాదాపు అంతా కొత్తవారే కావడంతో్ జింబాబ్వే నుంచి ప్రతిఘటన ఉంటుందని తొలుత ఊహించారు. అయితే అందుకు భిన్నంగా ఆతిథ్య జింబాబ్వేను భారత చుట్టేసి శభాష్ అనిపించుకుంది. వరుసగా రెండు వన్డేల్లో ఘన విజయం సాధించిన భారత జట్టు ప్రస్తుతం క్లీన్ స్వీప్ పై కన్నేసింది.
ఇరు జట్ల మధ్య బుధవారం మధ్యాహ్నం గం.12.30ని.లకు హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో మూడో వన్డే జరుగనుంది. కాగా, భారత జట్టు వన్డే సిరీస్ ను గెలవడంతో మరికొంత మంది యువ క్రికెటర్లను పరీక్షించాలని ధోని యోచిస్తున్నాడు. తమ రిజర్వ్ బెంచ్‌ను పరీక్షిస్తామని ఇప్పటికే ధోని స్పష్టం చేయడంతో రేపు జరిగే మ్యాచ్‌లో ప్రయోగాలు తప్పకపోవచ్చు. జింబాబ్వేతో సిరీస్ ద్వారా యుజ్వేంద్వ చాహల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్‌కు అంతర్జాతీయ వన్డేల్లో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్, జయంత్ యాదవ్‌లకు ఇంకా అవకాశం రాలేదు.
దీంతో వీరి ముగ్గురిలో కనీసం ఇద్దరికైనా చివరి వన్డే తుది వన్డే జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం మ్యాచ్‌లోనే శతకం చేసిన కేఎల్ రాహుల్ తొలి భారత ఓపెనర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆ తరువాత రెండో వన్డేలో కూడా ఆకట్టుకున్న రాహుల్ ఆకట్టుకున్నాడు. దీంతో అతనికి మూడో వన్డేలో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు తొలి రెండు వన్డేల్లో ఆడిన అంబటి రాయుడ్ని కూడా రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసే అవకాశం ఉంది. వీరి స్థానంలో ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్ తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కరుణ్ నాయర్‌తో కలిసి ఫయాజ్ ఫజల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more