జింబాబ్వే పర్యటనలో అతిధ్యజట్టుపై టీమిండియా యువసేన అంచనాలు ఫలించాయి. మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీస్ చేసింది ధోని సేన. టీమిండియా బౌలర్లు జింబాబ్వే అటగాళ్లను తమ బంతులతో బెంబేలెత్తించి మూడు వన్డేలను కైవసం చేసుకున్నారు. మూడు వన్డేల సిరీస్ లో మూడింటినీ గెలుచుకున్న టీమిండియా ఇక టీ20 సిరీస్ పై దృష్టిపెట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వేపే టీమిండియా కేవలం 21.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో విజాయాన్ని సాధించింది.
124 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా కేవలం 21.5 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (63), ఫజల్ (55) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును సునాయాసంగా గెలిపించారు. జింబాబ్వే బౌలర్లు ఎంత శ్రమించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అతిథ్యజట్టు 42.2 ఓవర్లలో 123 పరుగులకు కుప్పకూలింది.
దీంతో జింబాబ్వే 124 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. భారత బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణించి నాలుగు వికెట్ల పడగొట్టాడు. జట్టులో అత్యధికంగా సిబండా 38 పరుగులు చేశాడు. జింబాబ్వే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుంది. పరుగుల వేటలో బోల్తా: మూడో వన్డేలోనూ జింబాబ్వే బ్యాట్స్మెన్ పరుగుల వేటలో చతికిలపడ్డారు. చిబాబా 27, మరుమా 17, మడ్జివా 10 (నాటౌట్) పరుగులు చేయగా, ఇతర ఆటగాళ్ల స్కోరు సింగిల్ డిజిట్కే పరిమితమైంది.
భారత బౌలర్లు చహల్ రెండు, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో భారత్ బౌలర్ ధావల్ కులకర్ణి.. ఓపెనర్ మసకద్జ (8)ను అవుట్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత చిబాబా, సిబండా కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా ఆచితూచి పరుగులు రాబట్టారు. దీంతో రన్రేట్ మందగించింది. చహల్ వీరిద్దరినీ అవుట్ చేయడంతో జింబాబ్వే తేరుకోలేకపోయింది. ఇక బుమ్రా..మరుమాను పెవిలియన్కు చేర్చడంతో జింబాబ్వే వికెట్ల పతనం వేగంగా సాగింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more