Pakistan pacer Mohammad Amir backs life bans for match-fixers

Pakistans amir backs life bans for match fixers

Karachi, England, Test, Mohammad Amir, Pakistan, Salman Butt, Mohammad Asif, corruption, spot-fixing, life ban, match fixers, Test cricket, lords cricket news, cricket

Pakistan's Mohammad Amir said match-fixers should be banned for life as he prepares to return to Test cricket at Lord's,

వాళ్లకు జీవితకాల నిషేధమే కరెక్టు..

Posted: 06/19/2016 10:00 AM IST
Pakistans amir backs life bans for match fixers

మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన క్రికెటర్లకు జీవిత కాల నిషేధం విధించడమే సబబని గతంలో ఫిక్సింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ ఫిక్సర్లకు జీవిత కాల నిషేధమే తగిన శిక్షని ఇటీవల ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ చేసిన వ్యాఖ్యలకు ఆమిర్ మద్దతు తెలిపాడు.  క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే వారిపై జీవిత కాలం నిషేధం విధించడం ఒకటే సరైన మార్గమన్నాడు.

తాను కూడా ఫిక్సింగ్ కు పాల్పడిన తరువాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేస్తానని అస్సలు అనుకోలేదని తన చేదు జ్ఞాపకాల్ని ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. మళ్లీ తాను టెస్టు క్రికెట్ ఆడటం నిజంగా అదృష్టమేనన్నాడు. ఇంకా ఇప్పటికే తన పునరాగమనం నమ్మశక్యంగా లేదన్నాడు. తన టెస్టు క్రికెట్ జీవితం తిరిగి ఇంగ్లండ్లోని ప్రారంభం కావడంపై ఆమిర్ ఆనందం వ్యక్తం చేశాడు. 

ఇంగ్లండ్ తో సిరీస్కు ఆతృతగా ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 2010లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిన ఆమిర్ ఐదు సంవత్సరాల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. ఇటీవల పాక్ జట్టులో పునరాగమనం చేసిన ఈ స్టార్ పేసర్ ఆసియా కప్లో రాణించి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో అతని ఇంగ్లండ్ వెళ్లే పాక్ జట్టులో స్థానం కల్పించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Amir  fixing  pakistan  england  cricket  

Other Articles