kohli-back-at-the-nets-ahead-of-west-indies-tour

Kohli back at the nets ahead of west indies tour

Virat Kohli, west indies tour, team india, practice session, Shane Warne, best world T20 team, warne dream team, AB de Villiers, Andre Russell, Brendon McCullum, Chris Gayle, David Warner, IPL, Mitchell Starc, MS Dhoni, cricket

Shane Warne picks his World T20 XI, Virat Kohli only Indian in the list

మళ్లీ మొదలు పెట్టేసిన విరాటుడు..

Posted: 06/19/2016 10:58 AM IST
Kohli back at the nets ahead of west indies tour

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మళ్లీ ప్రాక్టీసు మొదలుపెట్టాడు. వచ్చే నెలలో అత్యంత కీలకమైన వెస్టిండీస్ టూర్ ఉండటంతో 27 ఏళ్ల డాషింగ్ బ్యాట్స్‌మన్ నెట్స్‌వద్దకు వచ్చాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 9వ సీజన్‌లో 973 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ సాధించిన కోహ్లీ.. అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. దానికి ముందు జరిగిన టి20 ప్రపంచకప్‌లో కూడా భారత జట్టును సెమీస్ వరకు నడిపించాడు.

కారులో కిట్ బ్యాగ్ వేసుకుని శిక్షణకు వెళ్తున్న ఫొటోను కోహ్లీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. దాంతో కొన్నాళ్ల పాటు  ఊరుకున్న విరాట్.. ఇప్పుడు వెళ్లేది విండీస్ కావడంతో గట్టిగా సిద్ధం అవ్వాలని భావిస్తున్నాడు. విండీస్‌లో 49 రోజుల పాటు జరిగే పర్యటనలో టీమిండియా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. దానికి ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా ఉంటాయి. జూలై 9న సెయింట్ కిట్స్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. తొలి టెస్టు జూలై 21వ తేదీ నుంచి మొదలవుతుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  west indies tour  team india  practice session  cricket  

Other Articles