టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని భావించి, అనిల్ కుంబ్లేతో పోటీపడి ఓడిపోయిన మాజీ టీం డైరెక్టర్ రవి శాస్త్రి, కోచ్ ని ఎంపిక చేసిన విధానమే తనకు నిరుత్సాహాన్ని కలిగించిందని అన్నాడు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తాను గత 18 నెలలుగా ఓ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో కృషి చేస్తూ వచ్చానని, తదుపరి మూడేళ్లలో ఎంతో సాధించాలని ప్రణాళికలు వేశానని చెప్పారు. ఓ టాలెంటెడ్ టీమ్ ను సృష్టించిన వేళ, తనను దూరం పెట్టారని చెప్పారు. అనిల్ కుంబ్లేను ఎంపిక చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు దానికి సమాధానం చెప్పాల్సింది తాను కాదని అన్నాడు. తనతో ఉన్న సమస్యేంటో సౌరవ్ గంగూలీనే అడిగి తెలుసుకోవాలని చెప్పాడు.
తన బాధ్యత ఇంటర్వ్యూకు హాజరవడమేనని, ఆపై వెనకాల ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. కాగా, తన ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ అసలు లేనే లేడని రవిశాస్త్రి ఇప్పటికే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గంగూలీయే తనను అడ్డుకున్నాడని కూడా రవిశాస్త్రి ఆరోపించాడు. ఇంటర్వ్యూలో ఏం అడిగారని ప్రశ్నిస్తే, తానేమీ సీఈఓ పోస్టుకు దరఖాస్తు చేయలేదని, సచిన్, సంజయ్ జగ్దాలే, వీవీఎస్ లక్ష్మణ్ లతో భారత క్రికెట్ భవిష్యత్ గురించి ఎంతో చర్చించానని, తాను టీమ్ డైరెక్టరుగా ఉన్న సమయంలో కొన్ని విషయాలను గుర్తు చేశానని తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మంచి ఆటతీరు చూపిందని వెల్లడించినట్టు పేర్కొన్నాడు. విజయం కోసం ఆటగాళ్లు తపిస్తున్నారని వెల్లడించానని. టెస్టు క్రికెట్ లో నెంబర్ వన్ హోదాలో లేకపోవడానికి కారణం ఆరు నెలలుగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడమేనని గుర్తు చేసినట్టు వివరించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more