బ్యాటింగ్, ఫీల్డింగ్ లో రాణించడానికి కారణం ఫిట్ నెస్సేనని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కెరీర్ ఆరంభంలో ఫిట్ నెస్ గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నాడు. దీంతో తన పూర్తి సామర్థ్యం ప్రదర్శించలేకపోయానని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 2012 ఐపీఎల్ తరువాత ఫిట్ నెస్ ప్రాధాన్యత గుర్తించానని చెప్పాడు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ తయారు చేసుకుంటున్ననని చెప్పాడు. ఏం తినాలి?, ఎంత వర్కవుట్ చేయాలి?, ఏ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి? వంటి విషయాలన్నీ క్రమబద్దంగా పాటిస్తున్నానని అన్నాడు. ఆ తరువాత పూర్తి సామర్థ్యంలో ఆడగలుగుతున్నానని, మంచి బ్యాట్సమన్, ఫీల్డర్ వంటి కితాబులందుకుంటున్నానని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ ను సంతరించుకోవాలనుకుంటే క్రమ శిక్షణ పాటించాలని సూచించాడు.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వన్డేల్లో తన రెండో ర్యాంకును నిలుపుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ 813 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. మరోవైపు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలవగా, శిఖర్ ధవన్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలాఉండగా, దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స 887 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా, ఆ దేశానికే చెందిన మరో క్రికెటర్ హషీమ్ ఆమ్లా 778 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు.
ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ మొదటి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ హకిబుల్ హసన్ మూడో స్థానంలో నిలిచారు. కాగా, బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఏ ఒక్క భారత ఆటగాడు టాప్-10లో నిలవకపోవడం గమనార్హం. ఇక జట్ల విషయానికొస్తే ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. ఆల్ రౌండర్ల కోటాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హసనల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more