Kanpur to host first Test as players announce India-New Zealand schedule

Bcci announces schedule for new zealand series

India Test captain,Virat Kohli,India-New Zealand,Visakhapatnam,Dharamsala,Virat Kohli,Mohammad Shami,Holkar Stadium,Green park,Eden Gardens,BCCI,Anil Kumble, cricket news, cricket

Indore is set to host its first-ever Test during the three-match series against New Zealand in September-October as India's top cricketers, in a unique way.

కివీస్ తో టీమిండియా 3 టెస్టులు, 5 వన్డేలు.

Posted: 06/29/2016 05:57 PM IST
Bcci announces schedule for new zealand series

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తన భారత పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. భారత పర్యటనలో మూడు టెస్టుల సిరీస్తో పాటు, ఐదు వన్డేల సిరీస్ను  న్యూజిలాండ్ ఆడనుంది. ఈ మేరకు ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్ వివరాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ 22వ తేదీన తొలి టెస్టును కాన్పూర్లో నిర్వహిస్తుండగా, సెప్టెంబర్ 30వ తేదీన ఇండోర్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. దీంతో ఇండోర్ టెస్టు మ్యాచ్కు తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక మూడో టెస్టు  అక్టోబర్ 8 నుంచి -12 వ తేదీ వరకూ ఈడెన్ గార్డెన్ లో జరుగనుంది. ఇక వన్డేల విషయానికొస్తే.. అక్టోబర్ 16వ తేదీన ధర్మశాలలో తొలి వన్డే, అక్టోబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రెండో వన్డే, అక్టోబర్ 23వ తేదీన మొహాలీలో మూడో వన్డే, అక్టోబర్ 26వ తేదీన రాంచీలో నాల్గో వన్డే జరుగుతుండగా, చివరి వన్డేను అక్టోబర్ 26వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించనున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  New Zealand  Virat Kohli  Indore  Kanpur  BCCI  cricket  

Other Articles