Harbhajan's claim of being 'beaten up' a joke: Akhtar

Shoaib akhtar laughs off brother bhajji s claims

Harbhajan Singh, S Sreesanth, Indian Cricketer, IPL 2008, Harbhajan Singh,Shoaib Akhtar,Yuvraj Singh, Akhtar beats Harbhajan, Cricket, Pakistan India cricket, Cricket, Sports, latest cricket news

Shoaib Akhtar has laughed off Harbhajan Singh's claim that he and Yuvraj Singh were beaten by the former pacer in a hotel room in Pakistan.

భజ్జీ. వ్యాఖ్యలు సత్యదూరం, కోట్టిపారేసిన స్పీడ్ స్టర్..

Posted: 07/05/2016 06:59 PM IST
Shoaib akhtar laughs off brother bhajji s claims

ఐపీఎల్ టోర్నీలో క్రికెటర్ శ్రీశాంత్ను చెంప దెబ్బ కొట్టడం తప్పేనని అంగీకరించిన టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఆ విషయంలో అందరూ తననే తప్పబట్టారని, అన్ని వేళ్లూ తన వైపే చూపించాయని అన్నారు. అయితే ఈ సందర్భంగా గతంలో తనతో పాటు యువరాజ్ సింగ్ పై షోయబ్ అక్తర్ దాడి చేశాడని కూడా చెప్పాడు. దీంతో హర్భజన్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పీడ్ స్టర్, రావల్సిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ స్పందించాడు. 2004లో తాను వారిని కొట్టానంటూ హర్భజన్ వ్యాఖ్యలన్నీ సత్యదూరమని.. అదంతా ఓ జోక్ అంటూ కోట్టిపారేశాడు.

అప్పుడు తాము సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ చేశామని అన్నాడు. ఇస్లామాబాద్ హోటల్ గదిలో ఆనాడు జరిగిందంతా పెద్ద జోక్ అని అన్నాడు. హర్భజన్ చాలా దూకుడుగా ఉంటాడని చెప్పిన అఖ్తర్...జరిగిన దానిని భజ్జీ ఎక్కువ చేసి చెప్పాడని అన్నాడు. అయినా జూనియర్లను కొట్టడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని తెలిపాడు. పాకిస్థాన్ పర్యటన సందర్భంగా బస చేసిన హోటల్ రూంకు వచ్చి తనను, యువీని కొడతానని అఖ్తర్ బెదిరించాడని హర్భజన్ సింగ్ ఇటీవల పేర్కొన్నాడు. అయితే రూంకి వస్తే ఎవరిని ఎవరు కొడతారో చూద్దామని రిటార్ట్ ఇచ్చానని చెప్పిన భజ్జీ, అఖ్తర్ భారీగా ఉంటాడని, బాగా బలంగా ఉండడంతో అతనిని చూసి కాస్త భయపడిన మాట మాత్రం వాస్తవమని చెప్పుకోచ్చాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan singh  Shoaib Akhtar  Yuvraj Singh  ipl  sreesanth  BCCI  Cricket  

Other Articles