వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జెరోమ్ టేలర్ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెలలో భారత్ తో జరగనున్న టెస్టు క్రికెట్ పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన అయన.. సెలక్టర్ల పద్దతిపై విసుగెత్తి.. విమర్శలు సంధిస్తూ టెస్టు క్రికెట్ కు విడ్కోలు పలికాడు. కెరీర్లో 46 టెస్టు మ్యాచులాడిన టేలర్ 130 వికెట్లు పడగొట్టాడు. 18 ఏళ్ల వయసులో 2003 ఏడాది శ్రీలంకతో సిరీస్ లో ఆరంగేట్రం చేసిన టేలర్ 13 ఏళ్లుగా విండీస్ జట్టు తరుఫున టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. వన్డేలు, టీ20 ఫార్మాట్లో బౌలర్ టేలర్ కొనసాగుతాడు.
ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీలో చివరి టెస్ట్ ఆడిన టేలర్ ను భారత్‌తో సిరీస్ కు బోర్డు పక్కన పెట్టింది. దీంతో తాను ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు బోర్డుకు తెలిపాడు. గాయాల కారణంగా ఎక్కువగా సతమతమయ్యాడు. 2009లో 11 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు కేవలం 51 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో జట్టుకు విజయాన్ని అందించాడు. అదే ఏడాది ఆ సిరీస్ తర్వాత 2009-2014ల మధ్య ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.
మళ్లీ జట్టులోకి వచ్చాక ఆస్ట్రేలియాపై 6/47తో రాణించి జట్టులో చోటు ఖాయం చేసుకుని 17 టెస్టుల్లో ప్రధాన బౌలర్ గా జట్టుకు సేవలందించాడు. 2008లో న్యూజీలాండ్ పై 10వ నంబర్ ఆటగాడిగా క్రీజులోకొచ్చిన టేలర్ ఏకంగా సెంచరీ (106) సాధించి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. వన్డేలు, టీ20లలో కొనసాగాలని, మరోవైపు గాయాల వేధిస్తున్నాయని భావించిన ఈ బౌలర్ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more