Ravindra Jadeja records statement in Lion selfie controversy at Gir Wildlife sanctuary

Ravindra jadeja records statement in lion selfie case

West Indies Cricket Team, India Cricket Team, Ravindra jadeja, AP Singh, CCF, Cricket, Gujarat Forest Department, India, Ravindra Jadeja, SportsTracker, Wildlife Protection Act, West Indies vs India 2016, sports news, sports, cricket news, cricket

Cricketer Ravindra Jadeja recorded his statement in the case where he allegedly flouted rules and took selfies with lions at Wildlife Sanctuary at Gir in Junagadh.

రవీంద్ర జడేజాకు సెల్పీలు తెచ్చిన తంటా..

Posted: 07/16/2016 06:39 PM IST
Ravindra jadeja records statement in lion selfie case

ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ సీజన్ ముగియగానే తన భార్యతో కలసి గుజరాత్ లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని గత నెల 14,15 తేదీల్లో సందర్శించి.. దిగిన సెల్పీలు అయనకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. గిర్ అభయారణ్యాన్ని సందర్శించిన సందర్భంగా పులులతో దిగిన సెల్ఫీ కేసులో ఆయనపై పలు వన్యప్రాణుల పరిరక్షణ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖాధికారులు నిర్ణయించారు. భారత అటవీ చట్టం ప్రకారం అక్రమంగా అభయారణ్యంలోకి ప్రవేశించి పులులతో సెల్ఫీ దిగిన జడేజాపై వన్యప్రాణి పరిరక్షణ చట్టంతో పాటు మరో కేసు కూడా పెట్టాలని నిర్దేశించారు. అభయారణ్యంలోకి జడేజాను అనుమతించిన ఇద్దరు అటవీశాఖ రేంజ్ అధికారులపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు అటవీ చట్టాన్ని ఉల్లంఘించిన జడేజాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.   

విచారణ కోసం జునాగడ్ కు రావాలని జడేజాకు అటవీశాఖాధికారులు సమన్లు జారీ చేసినా ఆయన రాకపోవడంతో టెలీఫోన్ ద్వారా ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అభయారణ్యంలో జీపులో తిరగటం, సింహాలతో సెల్ఫీ దిగడం చట్టం ప్రకారం నేరమని తనకు తెలియదని జడేజా సమాధానమిచ్చినట్లు సమాచారం. అభయారణ్యంలో వన్యప్రాణుల సమీపంలోకి వెళ్లడం, వాటిని వేధించడం వన్యప్రాణుల చట్టం ప్రకారం నేరమని, ఆ విషయం విద్యావంతుడైన జడేజాకు తెలియదా అని ఓ సీనియర్ అటవీశాఖాధికారి ప్రశ్నించారు. అభయారణ్యంలో జీపు నుంచి కిందకు దిగడం, సింహాలతో సెల్ఫీ దిగడం నేరమని అభయారణ్యం ఎంట్రీ గేటు వద్ద బోర్డులు పెట్టామని అధికారులు చెపుతున్నారు. మొత్తంమీద అటవీ, వన్యప్రాణి పరిరక్షణ చట్టాల ప్రకారం కేసులు పెట్టి క్రికెటర్ జడేజాపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindra jadeja  photos with lions  West Indies vs India 2016  cricket  

Other Articles