Virender Sehwag : Anil Kumble is the perfect man to coach India

Virender sehwag feels anil kumble s true test will come soon

Virender Sehwag, Anil Kumble, india vs west indies, ind vs wi, wi vs ind, r ashwin, kl rahul, saha, west indies bowling, sports news, sports, cricket news, cricket

Virender Sehwag backed Anil Kumble as the best choice as Team India coach, but admitted his real challenge would be to win Tests against the likes of England, Australia and South Africa

టీమిండియా కోచ్ కుంబ్లే.. మొసళ్ల పండగ ముందుందట

Posted: 08/11/2016 06:23 PM IST
Virender sehwag feels anil kumble s true test will come soon

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన క్రికెట్ కోచ్గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లేకు విండీస్ తో జరిగే టెస్టు సిరీస్ లతో పాటుగా మున్ముందు ఇంకా అసలైన సవాళ్లు వున్నాయని మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ గా పేరుతెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కోచ్గా కుంబ్లేనే సరైన వ్యక్తిగా అభివర్ణించిన సెహ్వాగ్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లను ఎదుర్కొనేప్పుడు కఠిన పరీక్ష ఎదుర్కొనక తప్పదన్నాడు.

'నేను అనుకోవడం టీమిండియాకు అనిల్ కుంబ్లేనే సరైన కోచ్. టెస్టుల్లో ఒక సెంచరీ సాధించడంతో పాటు ఆరు వందలకు పైగా వికెట్లు సాధించిన కుంబ్లే సామర్థ్యంపై నమ్మకం ఉంది. అతనొక సానుకూల స్వభావం కల్గిన వ్యక్తి. ఎప్పుడూ ఓటమిని అంగీకరించే తత్వం కూడా కాదు. దీంతో అనిల్ నుంచి భారత జట్టు చాలా విషయాలను నేర్చకుంటుంది. విండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లలో అనుభవరాహిత్యమైన జట్టుపై విజయాలను నమోదు చేయడం వేరు.

అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీమిండియా తలపడేటప్పుడు అనిల్ కుంబ్లేకు సిసలైన సవాల్ ఉంటుంది. ఆయన ప్రతిభకు ఆ జట్లతో జరిగే పోటీలే సమాధానం చెబుతాయి. వాటిల్లో విజయం సాధిస్తే టీమిండియాకు అనీల్ కుంబ్లే తిరుగులేని నాయకుడిగా తయారవుతాడు అని సెహ్వాగ్ తెలిపాడు. ఇదిలా ఉండగా, భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా చేయమని బీసీసీఐ ఆఫర్ చేస్తే దాన్ని స్వీకరిస్తారా?అన్న ప్రశ్నకు సెహ్వాగ్ దాదాపు నో అనే సమాధానమే చెప్పాడు. తనకు కోచ్ గా చేసే తీరిక లేదంటూ సెహ్వాగ్ బదులిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  Anil Kumble  West Indies Test series  India  cricket  

Other Articles