టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వరుస ట్వీట్లతో తన ఫాలోయర్స్ ను అలరిస్తున్నాడు. తన కెరీర్ లో వున్నంత సేపు అసలు తనకు మాటలే రావన్నట్లుగా వ్యవహరిచిన వీరూ.. తన విరమణ తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ గా ఎంచుకున్న ట్విట్టర్ లో మాత్రం దూసుకెళ్తున్నాడు. సోషల్ మీడియాలోనూ దూకుడుగా ఉంటాడని వీరూ నిరూపించాడు. విషయం ఏంటంటే.. టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ పుట్టినరోజు. ట్విట్టర్ ద్వారా ఇషాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే వీరూ తన ట్వీట్ లో ఇషాంత్‌కు కొత్త నిక్ నేమ్ పెట్టాడు. టీమిండియా జట్టులో ఇషాంత్ ఎత్తయిన ఆటగాడు కావడంతో ప్రపంచంలో ఎత్తైయిన నిర్మాణాలలో ఒకటైన బూర్జ్ ఖలీఫాతో పోల్చాడు. బాల్ వాలే బూర్జ్ ఖలీఫా, శర్మాజీకా లడ్కా అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ లో ఆటపట్టించాడు. ఇషాంత్ ను ఎంపిక చేసుకుంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారని సెహ్వాగ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఇక అటు బ్రిటిష్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ విషయంలోనూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు.
ఇప్పటివరకు క్రికెట్లో వరల్డ్ కప్ గెలువని మీరా (ఇంగ్లండ్) మాగురించి మాట్లాడేదని దెప్పిపొడిచాడు. దీంతో రోషం పొడుచుకొచ్చిన మోర్గాన్ ఏకంగా సెహ్వాగ్‌కే సవాల్ విసిరాడు. ’హాయ్ వీరేంద్ర సెహ్వాగ్.. ఇండియా మరో ఒలింపిక్స్ మెడల్ గెలిచేలోపే ఇంగ్లండ్ వన్డే వరల్డ్ కప్ కొడుతోంది. నాతో రూ. 10 లక్షల బెట్టు కాస్తావా’ అని సవాల్ చేశాడు. ఈ సవాల్‌ను లైట్ తీసుకున్న సెహ్వాగ్.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి తన షో 'న్యూస్ అవర్'లో మోర్గాన్‌పై మాట్లాడమని అడిగారని, కానీ, టీవీలో ప్రసారమయ్యేంత సీన్ ఆయనకు లేదని తాను తోసిపుచ్చానని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సున్నితమైన హాస్యంతో కూడిన ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more