ఈడెన్ గార్డెన్ వేదికగా పర్యాటక జట్టు న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 339 పరుగుల అధిక్యత సాధించింది, మూడవ రోజు అట ముగిసే సమయానికి ఎనమిది వికెట్ల నష్టానికి 227 పరుగుల సాధించింది, దీంతో తోలి ఇన్నింగ్స్ లోని అధిక్యంతో కలసి భారత్ మొత్తంగా 339 పరుగుల అధిక్యంతో కొనసాగుతుంది. అదిలోనే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల కడలి ఈదుతున్న టీమిండియాను భారత సారధి విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అదుకోగా, గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్ లో రాణించలేకపోయినా రోహిత్ శర్మ అద్బుత ఇన్నింగ్స్ ఆడి (132 బంతుల్లో 82)తో రాణించడంతో భారత్ ఆధిక్యం 339 పరుగులకు చేరుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో లాగానే భారత జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ధావన్(17), విజయ్(7) మరోసారి విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో రాణించిన చతేశ్వర్ పుజారా(4), రహానే (1) త్వరగానే ఔటయ్యారు. దీంతో 43 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (65 బంతుల్లో 45) వేగంగా ఆడి జట్టును ఆదుకున్నాడు. 7వ వికెట్ కు రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా సెంచరీ (103) భాగస్వామ్యం నెలకొల్పారు. భారత జట్టు 106 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ 89 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు.
61వ ఓవర్లో శాంట్నర్ భారత్ కు షాకిచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా సిక్స్ కొట్టి, మరోసారి షాట్ ఆడే యత్నంలో నీషం క్యాచ్ పట్టడంతో ఎనిమిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. వాతావరణం అనుకూలించకపోవడంతో కాస్త ముందుగానే అంపైర్లు ఆట నిలిపివేశారు. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 63.2 ఓవర్లాడి 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా(39 బ్యాటింగ్), అతడికి తోడుగా భువనేశ్వర్ కుమార్ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు మూడో రోజు ఆటలో మురళీ విజయ్(7), పూజారా(4), ధవన్(17), రహానే(1), కోహ్లి(45),అశ్విన్(5)లు పెవిలియన్ కు చేరారు. ఇప్పటివరకూ భారత్ కోల్పోయిన ఆరు వికెట్లలో హెన్రీ, సాంట్నార్ చెరో మూడు వికెట్లు సాధించగా, బౌల్ట్ కు రెండు వికెట్లు లభించాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more