ఐసీసీ అగ్రహానికి గురైన సఫారీలు.. Tahir fined, South Africa docked for slow over rate

Cricket tahir fined south africa docked for slow over rate

Warner,Tahir,South Africa,shravanth vijayakumar,Reuters,International cricket council,Imran Tahir,ICC,Ian Ransom,Faf du Plessis, south africa vs australia,cricket news, cricket

South Africa were penalised for maintaining a slow over-rate in Wednesday's fifth ODI against Australia in Cape Town

సస్పెన్షన్ అంచున సఫారీల కెప్టెన్ డూప్లెసిస్

Posted: 10/14/2016 09:24 PM IST
Cricket tahir fined south africa docked for slow over rate

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మొత్తం సభ్యులపై ఐసీసీ కన్నెరచేసింది, జట్టు సభ్యులకు జరిమానా విధించడంతో పాటు మరో ఏడాది లోపు ఇలాంటి ఘటనను పునరావృతం చేస్తే జట్టు కెప్టెన్ పై సస్సెన్షన్ విధిస్తామని కూడా హెచ్చరించింది. ఆస్ట్రేలియాతో ఇటీవ‌ల జరిగిన ఐదో వన్డేలో ద‌క్షిణాఫ్రికా స్లో ఓవరేట్తో బౌలింగ్ చేసింది. ఈ కార‌ణంగా ఆ జట్టు ఆట‌గాళ్లు అంద‌రూ త‌మ మ్యాచ్ ఫీజు నుంచి జ‌రిమానా స‌మ‌ర్పించుకున్నారు. ఆ జ‌ట్టు కెప్టెన్ డు ప్లెసిస్కు 20 శాతం, ఇతర క్రికెట‌ర్ల‌కు 10 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించారు.

ఇక‌, రానున్న 12 నెలల్లో ఆ జ‌ట్టు మరోసారి ఇదే తీరు క‌న‌బ‌రిస్తే కెప్టెన్‌ ప్లెసిస్ సస్పెన్షన్ ఎదుర్కొనే ప్రమాదంలో ప‌డ్డాడు. మ‌రోవైపు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్కు వ్య‌క్తిగ‌తంగా మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు. ఆ మ్యాచు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్తో ఆయ‌న దురుసుగా ప్రవర్తించినందుకు గానూ ఈ జ‌రిమానా వేశారు. ఆయన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించి, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించాడ‌ని ఐసీసీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : David Warner  Imran Tahir  Captain Faf du Plessis  south africa vs australia  cricket  

Other Articles