అసీస్ లుకలుకలను అంగీకరించిన క్లార్క్ Michael Clarke: Australian Test players 'like a tumour'

Michael clarke australian test players like a tumour

Australia, India, Matthew Hayden, Michael Clarke, Mickey Arthur, Shane Watson, Simon Katich, South Africa, seperate group, cricket, sports

Former Australia captain Michael Clarke has revisited old feuds, describing Shane Watson as part of a group that was "like a tumour" on the team.

అసీస్ లుకలుకలను అంగీకరించిన క్లార్క్

Posted: 10/17/2016 04:55 PM IST
Michael clarke australian test players like a tumour

ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించిన తమ జట్టులోనూ కూడా లుకలుకలు వున్నాయని ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అంగీకరించాడు. తన జట్టులో తనతో పాటు వున్న తోటి అటగాళ్లను ఆయన క్యాన్సర్ కణితితో పోల్చాడు. తనతో పాటు చాలాకాలం క్రికెట్ ఆడిన షేన్ వాట్సన్ను కూడా ఆయన క్యాన్సర్ కణితలుగానే పరిగణించాడు. తన ఆటో బయోగ్రఫీ విడుదలకు సంబంధించి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లార్ పలు విషయాలను వెల్లడించాడు.

ఈ సందర్భంగా గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చోటుచేసుకున్న విభేదాలను, తన నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని క్లార్క్ మరోసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. తాను జట్టుకు కెప్టెన్ గా ఉన్న సమయంలో చాలా మంది ఆటగాళ్లు సెపరేట్ గ్రూప్ గా ఉండేవారనే సంగతిని పేర్కొన్నాడు. వారంతా ఒక కణితి లాంటి వారని, ఆ గ్రూప్ ను అలానే వదిలేస్తే క్యాన్సర్ తరహాలో ప్రమాదకరంగా మారిపోతారన్నాడు.
 
ఆ గ్రూప్ లో వాట్సన్ కూడా ఉన్నాడంటూ మరోసారి అడిగిన ప్రశ్నకు క్లార్క్ అవుననే సమాధానం ఇచ్చాడు. దీనిలో భాగంగానే మూడు సంవత్సరాల క్రితం భారత్ లో టెస్టు సిరీస్ లో మొహాలీలో జరిగిన మూడో మ్యాచ్ నుంచి పలువురు ఆటగాళ్లపై వేటు వేసినట్లు పేర్కొన్నాడు. మరోవైపు 2009లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా టెస్టు విజయం సాధించిన తరువాత అప్పటి వైస్ కెప్టెన్ గా ఉన్న సైమన్ కాటిచ్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పాడు చేశాడన్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  Michael Clarke  shane Watson  south africa  seperate group  cricket  

Other Articles