ధోని సేన వశమైన వన్డే సిరీస్.. తుస్సుమన్న కివీస్..! India vs NZ 5th ODI: Hosts beat guests by 190 runs

India vs nz 5th odi hosts beat guests by 190 runs

India vs New Zealand, 5th ODI, Vizag, MS Dhoni, virat kohli, amit mishra, kedar jadav, rohit sharma, Kane Williamson, jayanth yadav, jasprit bumrah, Teamindia, new zealand, fifth one day, vishakapatnam, Cricket, sports

Amit Mishra's five-wicket haul lifted India to a 190-run win over New Zealand in the fifth and final ODI in Vizag, handing the hosts a 3-2 series victory.

ధోని సేన వశమైన వన్డే సిరీస్.. తుస్సుమన్న కివీస్..!

Posted: 10/29/2016 09:04 PM IST
India vs nz 5th odi hosts beat guests by 190 runs

పర్యాటక జట్టు న్యూజిలాండ్తో జరిగిన ఐదు వన్డల సిరీస్ దోని సేన వశమైంది. సిరీస్ లో చివరిదైన మ్యాచ్ విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరుగుగా, టీమిండియా విధించిన విజయ లక్ష్యాన్ని చేధించడంతో కివీస్ బోల్తా పడ్డారు. అమిత్ మిశ్రా స్పిన్ మాయాజలం ముందు తలొగ్గిన న్యూజీలాండ్ వచ్చినట్టే వచ్చి వెనక్కు తిరిగి వెళ్లడంతో కివీస్ కేవలం 80 పరుగులకే అలౌట్ అయ్యింది. తొలి ఓవర్లోనే అద్భుత బంతితో గప్టిల్‌ (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన ఉమేష్‌ ప్రత్యర్థి పతనానికి బీజం వేశాడు.

మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్న మరో ఓపెనర్‌ లాథమ్‌ (19)ను బుమ్రా అవుట్‌ చేసి కివీస్‌ను మరో దెబ్బకొట్టాడు. అయితే, ఉమేష్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండ్రీలు బాదిన కెప్టెన్‌ విలియమ్సన్‌ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. అతనికి రాస్‌ టేలర్‌ (19) కాసేపు సహకరించాడు. కానీ.. స్పిన్నర్ల రంగ ప్రవేశంతో సీన్‌ మొత్తం మారిపోయింది. టర్న్‌ లభిస్తున్న పిచ్‌పై భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు కేన్‌, టేలర్‌ ఇబ్బందిపడ్డారు. అప్పటికే రనౌట్‌ ప్రమాదం తప్పించుకున్న విలియమ్సన్‌.. అక్షర్‌ బౌలింగ్‌లో కేదార్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి కివీస్‌ స్కోరు 15వ ఓవర్లకు 64/3.

ఆ తరువాత 16 పరుగుల తేడాతో కివీస్‌ తర్వాతి ఏడు వికెట్లూ కోల్పోయింది. 16వ ఓవర్లో మూడు బంతుల తేడాతో టేలర్‌, వాట్లింగ్‌ (0)ను అవుట్‌ చేసిన అమిత కివీస్‌ను చావు దెబ్బకొట్టాడు. తొలుత.. బంతిని తప్పుగా అంచనా వేసిన టేలర్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇవ్వగా, అమిత అద్భుతమైన గూగ్లీతో వాట్లింగ్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆరంగేట్రం చేసిన జయంత శర్మ కూడా అండర్సన్‌ (0)ను ఎల్బీగా అవుట్‌చేసి తొలి అంతర్జాతీయ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. మరోసారి విజృంభించిన మిశ్రా... నీషమ్‌ (3), టిమ్‌ సౌథీ (0)తో పాటు ఇష్‌ సోధి (0)ని అవుట్‌ చేశాడు. చివర్లో శాంట్నర్‌ (4)ను అక్షర్‌ బౌల్డ్‌ చేశాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ జట్టుకు రోహిత్ శర్మ, కోహ్లీ, ధోనిలతో పాటు చివరిలో కేధార్ జాదవ్, అక్సర్ పటేల్ లు రాణించడంతో టీమిండియా 269 పరుగులను స్కొరుబోర్డుపై నిలిపింది. రోహిత్ శర్మ-అజింక్యా రహానేలు జోడి మంచి ఆరంభాన్ని అందించారు. కాగా, రహానే(20) తొలి వికెట్గా వెనుదిరిగినా, రోహిత్-విరాట్ కోహ్లిల జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఈ జోడి 79 పరుగుల భాగస్వామ్యం జోడించిన తరువాత రోహిత్ శర్మ (70;65 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లు)రెండో వికెట్ గా అవుటయ్యాడు.  

ఆ తరువాత వచ్చిన ధోని.. విరాట్ తో జతకలసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాంట్నార్ బౌలింగ్లో వికెట్లు ముందు దొరికిపోయిన దోని పెవీలియన్ కు చేరాడు, ఆ వెనువెంటనే మనీష్ పాండే డకౌట్గా అవుటయ్యాడు. అ తరువాత 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ(76 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా నిష్ర్కమించడంతో భారత స్కోరు బోర్డు నెమ్మెదించింది.

చివరి 10 ఓవర్లలో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(24), కేదర్ జాదవ్(39) ఒత్తిడిలోనూ ఫర్వాలేదనిపించారు. న్యూజీలాండ్ బౌలర్లు స్లో బౌలింగ్ లోనూ పరుగులను రాబట్టడంతో నిర్ణీత 50.0 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 269 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, సోథీ తలో రెండు వికెట్లు సాధించగా, నీషమ్, సాంట్నార్లకు చెరో వికెట్ కు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teamindia  new zealand  India vs New zealand  fifth one day  vishakapatnam  

Other Articles