నోట్ల రద్దుపై స్పందించిన క్రీడారంగ ప్రముఖులు Sehwag, Mary Kom supports government move of demonetisation

Sehwag mary kom supports government move of demonetisation

demonetisation, Mary Kom, Narendra Modi, scraping of notes, virender sehwag, PM Modi

Sehwag, M C Mary Kom supported the government’s decision to demonetise 500 and 1000 rupee notes

నోట్ల రద్దుపై స్పందించిన క్రీడారంగ ప్రముఖులు

Posted: 11/15/2016 06:48 PM IST
Sehwag mary kom supports government move of demonetisation

నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు బారులు తీరుతున్న ప్రజల అవస్థలపై క్రీడాకారులు కూడా స్పందిస్తున్నారు. అవస్థులు ఇబ్బందులు తాత్కాళిక సమస్యలేనని ప్రజలు కొన్నిరోజుల పాటు సహకరించాలని ప్రధాని మోదీ కోరిన నేపథ్యంలో తనదైన శైలిలో కామెంట్లు సోస్టు చేశాడు డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. బ్యాంకుల ముందు క్యూ లైన్‌లో నిలబడుతున్న ప్రజలు ఇబ్బందులు పడటం బాధగా వుందన్నారు.

అయితే అందుకు భారత జవాను హనుమంతప్పను ఉదహరిస్తూ.. కాపాడబడతాననే ఆశతో వీర జవాను హనుమంతప్ప సియాచిన్‌లో 35 అడుగుల లోతున వారం రోజుల పాటు అలాగే వేచివున్నాడు. పైగా అక్కడ మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందంటూ జవాను ఫోటోను కూడా పోస్ట్ చేశాడు సెహ్వాగ్. అలాంటిది మన దేశాన్ని కాపాడుకునే క్రమంలో బ్యాంకుల ముందు కొన్ని గంటల పాటు ఖచ్చితంగా నిలబడగలమని దేశ ప్రజలకు విన్నవించాడు వీరేంద్ర సెహ్వాగ్.

ఆటు పెద్ద నోట్ల రద్దును ప్రముఖ బాక్సర్, రాజ్యసభ సభ్యురాలు మేరికోమ్ స్వాగతించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని తెలిపింది. దీని వల్ల ప్రజలు కొన్ని రోజుల పాటు ఇబ్బందులు పడినా... అతి తక్కువ డబ్బుతో ఎలా గడపాలో కొత్త అనుభవం వస్తుందని చెప్పింది. ప్రధాని మోదీ ధైర్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ భవిష్యత్తు బాగుంటుందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  scraping of notes  virender sehwag  mary  

Other Articles