ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో తాము టెస్టు మ్యాచ్ ను డ్రాగా ఎలా చేయాలన్న విషయాన్ని కూడ నేర్చుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో అసలు మ్యాచ్ లో ఏం జరిగింది..? ఆ విషయాన్ని కోహ్లీ బయటకు చెప్పకుండానే తాను పాఠాలు నేర్చుకున్నానని చెప్పడంలో అంతర్యమేమిటీ..? మ్యాచ్ ఆద్యంతం పర్యాటక జట్టు పైచేయి సాధించడంలో కుక్ గేమ్ ప్లాన్ ఎలా వర్క్ అవుట్ అయ్యిందన్న విషయాలను క్రీడా విశ్లేషకులు వివరిస్తున్నారు. విరాట్ కోహ్లీ సరిగ్గా 49పరుగుల వద్ద కోనసాగుతున్న తరుణంలో మ్యాచ్ అర్థంతరంగా డ్రాగా ముగిసింది.
ఇంగ్లాండ్ డిక్లెర్డ్ చేసిన తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 49 ఓవర్లలో 310 పరుగులు చేయాలి. కానీ భారత్ ఇంకా ఎక్కువ ఓవర్లే(52.3) ఆడిందని క్రీడా విశ్లేషకులు వివరించారు. భారత్ 49 ఓవర్లు ఆడాక కూడా అంపైర్లు మ్యాచ్ ముగియలేదు మరో 3 ఓవర్లు ఆడితే 90 ఓవర్లు అవుతాయని సూచించారు. దీంతో భారత్ బ్యాటింగ్ కొనసాగించింది. 90 ఓవర్లు ముగిసిన తరువాత ఆట ముగించే నిర్ణిత సమయానికి ఇంకో 10 నిమిషాల సమయం ఉన్నందున మరో రెండు ఓవర్లు అడించారని.. అయితే సరిగ్గా కోహ్లీ 49 పరుగుల వద్దకు చేరుకోగానే కుక్ డ్రా కోసం కోహ్లీని సంప్రదించడం అయన సరేనని చెప్పడంతో మ్యాచ్ డ్రాగా ముగిసిందని క్రీడా విశ్లేషకులు బావిస్తున్నారు.
భారత్ వికెట్లు కోల్పోతున్న సమయంలో కుక్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడికి గురిచేయడానికి ఫ్యాడ్‌కు తగిలిన ప్రతి బాల్‌ను అప్పీల్ చేయడం, ఫీల్డర్లను దగ్గరగా పెట్టడం వంటివి అమలు చేశాడని వివరిచారు. అంతేకాదు సమయం మిగిలుందని అంపైర్లకు నివేదించాడని కూడా విరాట్ తెలుసుకోలేకపోయాడని అన్నారు. అంతేకాదు కోహ్లీ సరిగ్గా 49 పరుగుల వద్దకు చేరుకోగానే డ్రా చేద్దామని కోహ్లీని అడిగాడని కూడా క్రీడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
అయితే దీని వెనుకనున్న రహస్యం ఏమిటంటే.. అంతా కుక్ గేమ్ ప్లాన్. ముక్కుసూటిగా వెళ్లి తత్వమున్న కోహ్లీ కుక్ గేమ్ ప్లాన్ లో చిక్కుకున్నాడు. కుక్ ఇలా ఎందుకు చేశాడంటే బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీ చేస్తే తర్వాత మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో ఉంటాడని. అదే సెంచరీకో, హాఫ్ సెంచరీకో దగ్గరగా వచ్చి ఆగిపోతే మానసికంగా కృంగిపోతాడని వారి భావనని క్రీడా విశ్లేషకులు బావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కుక్ అలా చేసుంటాడని తెలిపారు. కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ కంటే మ్యాచ్ ముఖ్యమని భావించే డ్రాకి అంగీకరించి ఉంటాడని భావించివుంటాడని వారి అంచనా.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more